రాహుల్ సిప్లిగంజ్ సహా 142 మంది.. పబ్ కేసులో లిస్ట్ ఇదే, అంతా ప్రముఖుల పిల్లలే

డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. అందులో ఉన్నవారు అంతా ప్రముఖులే కావడంతో.. వారు ఎవరు..? ఎంతమంది ఉన్నారనే చర్చ జరుగుతుంది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో మొత్తం 142 మంది లిస్టు విడుదల చేశారు. వారి అడ్రస్, ఫోన్ నంబర్లు తీసుకుని వారికి నోటీసులు ఇచ్చారు. అయితే వీరిలో ఉన్నవారు అంతా సంపన్న వర్గాలకు చెందినవారే.

వీరే వారు..

వీరే వారు..


పోలీసులు విడుదల చేసిన జాబితాలో ఆదిత్య పమ్నయ్, సహృద్ధ్ కసిరెడ్డి, ప్రణయ్ హరిహరన్, ప్రతాప్ శ్యామ్ మీనన్, ఎన్ అనుమోల్, లక్ష్మీనరసింహారెడ్డి, అయాన్ త్రిపురనేని, భరత్ అనుమోలు, త్రిపురనేని ఆదిత్య, అఖిలేష్ యాదవ్, చలసాని వినత్ దత్, వినోద్ కుమార్, సుశృత్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి, రామికిరణ్, రాజ్ కుమార్, వివేక్ సాయి, ఈశ్వర్ శంకర్, రోహన్, సుధీర్ కుమార్, ఆనంద్ రాజ్, ప్రతీక్, సత్యజిత్ రెడ్డి, ప్రణవ్ మహేశ్వరీ, హర్ష, అభిషేక్, సాహిల్ రెడ్డి, అనూజ్ గోయల్‌తోపాటు ఇతరులు ఉన్నారు.

మత్తులో జోగుతున్న యువతీ యువకులు

మత్తులో జోగుతున్న యువతీ యువకులు

బంజారాహిల్స్‌లో గల రాడిసన్‌ బ్లూ హోటల్‌పై అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేశారు. సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్‌ ఇన్‌ మింగ్‌ పబ్‌పై రైడ్‌ చేశారు. అక్కడికి పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు.. ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంజాయ్‌ చేస్తున్నారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌ పబ్‌లో పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ కూడా

రాహుల్ సిప్లిగంజ్ కూడా


సినీ, రాజకీయ, అధికార ప్రముఖులకు చెందిన పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రాహుల్‌ సిప్లిగంజ్‌ ఉన్నారు. అతనికి కౌన్సిలింగ్‌ ఇచ్చి.. తర్వాత నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించారు. సెలబ్రిటీల పిల్లలు ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. పబ్‌లో డ్రగ్స్‌ కూడా వాడినట్టు ఆధారాలు లభించాయి. పబ్‌లో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ, గంజాయితో నిండిన సిగరెట్లు దొరికాయి. పబ్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. నిర్వాహకులతోపాటు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారందరినీ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ తరలించారు. మీడియాకు తెలియడంతోనే హాట్‌టాపిక్‌గా మారింది.

ఎన్ కౌంటర్ చేయండి..

ఎన్ కౌంటర్ చేయండి..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. డ్రగ్స్ కేసు అంటూ పోలీసులు మళ్లీ రావడం మొదలుపెట్టారని, రెండు రోజులు హడావిడి చేసి మళ్లీ కేసును పక్కన పడేస్తారని విమర్శించారు. తెలంగాణలో డ్రగ్స్ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయి ? ఈ విషయం పోలీసులకు తెలియదా..? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+