హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో వర్షం.. జలమయమైన రహదారులు, ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్న యూత్

|
Google Oneindia TeluguNews

విశ్వనగరం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఈ సాయంత్రం కురిసిన వర్షంతో రహదారులపై వర్షపునీరు చేరుకుంది. . మొజాంజాహి మార్కెట్‌, కోఠి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుల్తాన్ బజార్, ట్యాంక్ బండ్ పరసరాల్లో వర్షం ఎక్కువగానే కొనసాగింది. చింతల్, జీడిమెట్ల, అమీర్ పేటలో కూడా వర్షం పడింది. భారీ వర్షంలో కూడా వినాయక శోభాయాత్రను కొనసాగింది. గణపతి బప్పా మోరియా నినాదాలతో నగరం మొత్తం మారుమోగింది. కోలాటాలు, డాన్సులు, గణనాథుడి పాటలతో శోభాయాత్ర సాగింది. జోరువానలో కూడా నిమజ్జనం కొనసాగించారు. నిమజ్జనం చూడడానికి వేలసంఖ్యలో భక్తులు హుస్సేన్ సాగర్ వచ్చారు.ఎన్టీఆర్, పీవీ మార్గ్‌తో పాటు ట్యాంక్‌బండ్ ప‌రిస‌రాల్లో భ‌క్తులు సంద‌డి చేశారు. ట్యాంక్ బండ్‌కు వైపున‌కు వ‌చ్చే దారుల‌న్నీ భ‌క్తుల‌తో కిక్కిరిపోయాయి. గ‌ణ‌ప‌తి బొప్పా మోరియా నినాదాల‌తో న‌గ‌రం మార్మోగిపోతోంది. వర్షంలోనూ జనం ఉత్సాహంగా ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. వర్షాలతో రోడ్లు తెగిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యింది. భారీ వర్షాలతో గోదావరి పరిధిలో గల అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ సారి ఎక్కువగానే వర్షపాతం కురిసింది.

rain in some places in hyderabad city

వర్షాల దాటికి ఇదివరకు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల దాటికి పలు చోట్ల నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే గ్రామాలలో వరి పంట చేతికి వచ్చే సమయం.. ఈ సమయంలో వర్షం వారిని ఇబ్బందికి గురిచేస్తోంది. దీనిని చెడగొట్టు వానలు అంటారని కొందరు రైతులు చెబుతున్నారు.

Recommended Video

Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

వర్షం వల్ల కొన్నిచోట్ల విద్యుత్ అంతరాయం కలిగింది. వినాయక నిమజ్జనం వల్ల కూడా పవర్ ఆఫ్ చేశారు. మరికొన్ని చోట్ల షార్ట్ సర్క్యూట్.. ట్రాన్స్ ఫార్మర్ సమస్య తలెత్తింది. దీంతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు. రెండున్నర గంటల పాటు చీకట్లోనే మగ్గారు. ఓ వైపు వర్షం.. మరోవైపు కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. ఆ తర్వాత సరిచేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

English summary
rain in some places in hyderabad city. people are suffered who have gone to home or workplace
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X