Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rains: హైదరాబాద్‍లో వర్షం.. ఇబ్బందుల్లో నగరవాసులు..

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. 10 గంటల సమయంలో వర్షం మొదలైంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పూరా, గండిపేట్, ఆరాంఘర్, శంషాబాద్, బండ్లగూడ జాగిర్, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, వెంగల్ రావు నగర్, యూసఫ్‌గూడ, మైత్రివనం, అమీర్‌పేట , పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఉద్యోగుల ఇబ్బంది

ఉద్యోగుల ఇబ్బంది

పాతబస్తీ చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కాస్, మియాపూర్‌, చందానగర్, మదీనాగూడ, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో పడిన వర్షంతో రోడ్లపైకి నీరు వచ్చింది. దీంతో ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. వర్షంతో కొన్ని ప్రాంతాల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పూర్, దోమలగూడ, గాంధీనగర్ జవహర్ నగర్, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

మరో రెండు రోజులు వర్షాలు

మరో రెండు రోజులు వర్షాలు

రాష్ట్రంలో రానున్న రెండు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం, అల్పపీడనం కారణంగా జోరువానలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై ప్రధానంగా పశ్చిమ, నైరుతి వాయుగుండం ఎక్కువగా ఉందని చెప్పారు.

తేలికపాటి నుంచి మోస్తరు

తేలికపాటి నుంచి మోస్తరు

దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ పరిస్థితుల్లో 2 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉందని డాక్టర్ నాగరత్న తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+