ప్రభాస్ తో కలిసి రామ్ చరణ్ కొత్త బిజినెస్
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. అలాగే త్వరలో విడుదల కాబోతున్న ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. ఒకరకంగా యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత బ్యానర్ కింద లెక్క. ప్రమోద్, విక్రమ్ కలిసి ఈ బ్యానర్ ను ప్రారంభించారు. దాదాపుగా వీరు అన్ని భారీ సినిమాలనే నిర్మిస్తున్నారు.
చిన్న సినిమాలను ప్రోత్సహించడంతోపాటు యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఈ బ్యానర్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రభాస్ నుంచి పూర్తి మద్దతు వీరికి ఉంది. తాజాగా విక్రమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి కొత్త బ్యానర్ ను ప్రారంభించబోతున్నాడు. యంగర్స్ ను ప్రోత్సహించడంతోపాటు పాన్ ఇండియా సినిమాలను నిర్మించడానికి వీరిద్దరూ కొలాబరేట్ అయ్యారు.

వీరి బ్యానర్ కు 'యువి మెగా పిక్చర్స్' అనే పేరు పెట్టి అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ నుంచి త్వరలోనే స్టార్ కథానాయకుల సినిమాలు రానున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, గోపీచంద్, శర్వానంద్, అనుష్క లాంటి స్టార్లు ఈ బ్యానర్ లో నటించబోతున్నారు. రామ్ చరణ్ కు ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ఒక బ్యానర్ ఉంది.
దీనిపై ఖైదీ నంబర్ 150, సైరా, ఆచార్య లాంటి సినిమాలను నిర్మించారు. చిరంజీవితోనే సినిమాలు చేసిన చరణ్ విక్రమ్ తో కొత్త బ్యానర్ స్థాపించిన తర్వాత ఇతర కథానాయకులతో సినిమాలు నిర్మించే అవకాశముందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చరణ్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాను కొత్త బ్యానర్ లో తీస్తారా? లేదంటే కొణిదెల ప్రొడక్షన్స్ కింద తీస్తారా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాలి.












Click it and Unblock the Notifications