హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోసం చేయడమే మీ నైజమా.. కేసీఆర్‌పై రాములమ్మ విమర్శలు

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై రాములమ్మ విజయశాంతి మరోసారి ఫైరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షాన నిలుస్తుందని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు గప్పాలు కొట్టారని విరుచుకుపడ్డారు. కానీ ఇవాళ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే వానాకాలం వరి పంటను కోసిన రైతన్నలు ధాన్యాన్ని ఎక్కడికి తరలించి అమ్మాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. గత యాసంగిలో ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని ప్రస్తావించారు.

ఈ వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర సర్కార్ ఇంకా ప్రతిపాదనలు పంపకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని ప్రకటించారు. ఈ యాసంగి వరిసాగు చేయొద్దని వ్యవసాయశాఖ నుంచి ప్రతి పాదనలు చేయించి... ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పడమే కానీ... ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలను సిద్ధం చేయడం, మార్కెట్లో అందుబాటులో ఉంచడంపై దృష్టి పెట్టలేదన్నారు. భరోసా ఇవ్వకుండా రైతులను ఆందోళనలో పడేశారని ఫైరయ్యారు.

 ramulamma vijayashanti fire on cm kcr

ప్రత్యామ్నాయ పంటలు వేరుశనగ, మినుములు, పెసర, శనగ వంటి పంటలను వరికి బదులుగా సాగుచేయాలని వ్యవసాయశాఖ ద్వారా చెప్పించారని గుర్తుచేశారు. వాటిని ఏ ప్రాంతంలో ఎంత సాగు చేయాలనే అంశంపై ప్రణాళిక ఖరారు చేయలేదని ఫైరయ్యారు. కొందరు రైతులు యాసంగి కోసం ఇప్పటికే నార్లు పోయడానికి పొలాన్ని చదును చేస్తున్నా.. వారికి దారీ తెన్నూ లేకుండా చేస్తున్నారని విజయశాంతి చెప్పారు. వానాకాలంలో పండించిన పెసర, మక్కలు, ఇతర పంటలను సైతం మార్కెటింగ్ చెయ్యడానికి రైతులు ఇబ్బందులు పడడమే కాకుండా.... సరైన మద్దతు ధర ప్రకటన లేకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

Recommended Video

Indian Railways 'Meri Saheli' రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు శుభ వార్త...! || Oneindia Telugu

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకం ఇవ్వాలనే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోకుండా సీజన్ మొదలైనా హుజురాబాద్ ఎన్నికలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్... నోట్ల ద్వారా ఓట్లను కొనాలని వ్యూహరచనలు, అబద్దపు ప్రచారాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులను పక్కన పెట్టేసిన రాష్ట్ర సర్కార్‌కు యావత్ తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పి టీఆర్ఎస్ పార్టీని బొందపెడతారని విజయశాంతి విమర్శించారు.

English summary
bjp leader vijayashanti angry on cm kcr. he is cheat to farmers she alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X