హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తృటిలో రేపిస్ట్ రాజు మిస్: చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ వద్ద కనిపించి.. అంతలోనే మాయం..

|
Google Oneindia TeluguNews

సైదాబాద్ సింగరేణి కాలనీ చైత్ర ఘటన కలచివేస్తోంది. నిందితుడు ఆటో డ్రైవర్ రాజు కోసం పోలీసులు బృందాలు విసృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే రాజు చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది. పంతంగి టోల్ గేట్ దగ్గర సీపీ కెమెరాల్లో రాజు వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయినట్టు సమాచారం. పోలీసులు వెళ్లేలోగానే రాజు అక్కడి నుంచి తప్పించుకున్నట్టు సమాచారం అందుతోంది. నిందితుడు రాజు కోసం పోలీసులు గత ఆరు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజు కోసం డెబ్బై రెండు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇంతలో అతను కనిపించాడని తెలియడంతో.. ఊపిరి పీల్చుకున్నారు. కానీ చివరి నిమిషంలో అతను తప్పించుకున్నాడు.

ఆరు రోజులుగా గాలింపు

ఆరు రోజులుగా గాలింపు

సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు కోసం.. ఆరు రోజులుగా వివిధ పోలీసు బృందాలు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితం నల్గొండ జిల్లా మోత్కూరు సమీపంలోని పంతంగి టోల్ గేట్ నుండి టువార్డ్స్ నార్కట్ పల్లి వైపు అనుమానితుడు వెళ్తున్న రాజును గమనించిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. పంతంగి నుంచి టువార్డ్స్ నార్కట్ పల్లివైపు వెంటనే ఒక పోలీస్ టీమ్ వెళ్లింది. పరిసర ప్రాంతంలో ఒక పోలీసు బృందం పరిశీలించింది. అక్కడి నుంచి నిందితుడు రాజు తప్పించుకున్నట్లు పోలీసుల ద్వారా సమాచారం అందుతోంది. రాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వెయ్యి మంది పోలీసులు ఈ కేసుపైనే ఫోకస్ పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)

కనిపించని చిన్నారి

కనిపించని చిన్నారి


హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణ త్యకు గురైన విషయం విషయం తెలిసిందే. నిందితుడు రాజు.. చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి బాలిక కనిపించలేదు. ఎంత వెతికినా కుటుంబసభ్యులకు కనిపించలేదు. అయితే పాప ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలు కొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు ..రాజు ఇంట్లో చిన్నారి కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీటిపర్యంతమయ్యారు.

YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ (ఫోటోలు)YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ (ఫోటోలు)

పరారీలో..

పరారీలో..


ఘటన జరిగిన రోజు నుంచి నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. పోలీసులు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా నిందితుడి ఆచూకీ లభించలేదు. పరారీలో ఉన్న నిందితుడు రాజును పట్టిచ్చిన వారికి పోలీసులు రివార్డు ప్రకటించారు. నిందితుడిని పట్టిచ్చిన వారికి రూ.10 లక్షలు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ ప్రకటించారు.

ఉరే సరి..

ఉరే సరి..


చిన్నారి చైత్ర ఘటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తోంది. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో నేతలు, ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒకడుగు ముందుకేసి చంపేయాల్సిందేనని కామెంట్ చేశారు. ఇటీవల తొడగొట్టి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి కామెంట్ చేసినా.. అదీ ఓ నీచుడి శిక్ష కోసం వ్యాఖ్యలు చేశారు. ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రియాక్టయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మంత్రి మల్లారెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వాడిని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. ఎన్ కౌంటర్ చేస్తాం.. విడిచిపెట్టేదే లేదన్నారు. ఫ్యామిలీ వద్దకెళ్లి పరామర్శించడం మాత్రమే కాదు. కుటుంబానికి న్యాయం చేస్తాం అని తెలిపారు. ఆ కుటుంబాన్ని అన్నిరకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

కామాంధుడి ఆకృత్యం

కామాంధుడి ఆకృత్యం

ఆరేళ్ల పాపపై ఓ కామాంధుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోననే అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా అతని గదిలో ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబసభ్యులు, స్థానికులు కూడా కంటతడిపెట్టారు.

English summary
rapist raju miss in choutuppal panthangi toll gate. locals are inform to police, quickly cops are come and search raju. he is missed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X