ఆర్ కృష్ణయ్యపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. బాండ్ల విషయంలో.. నయీమ్ పేరు కూడా..?
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ రాజ్యసభ అభ్యర్ధి ఆర్.కృష్ణయ్యపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు వచ్చింది. రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేశారు. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ పేరు చెప్పి తనను బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. అతనికి ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చినా 4 బాండ్ పేపర్లు తిరిగి ఇవ్వట్లేదని వివరించారు. ఇదివరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయూముద్దీన్ హతమైన సంగతి తెలిసిందే. తర్వాత అతని అనుచరుల ఆగడాలు కూడా వెలుగులోకి రాలేదు. కానీ రవీందర్ రెడ్డి చేసిన ఫిర్యాదు సంచలనం కలిగిస్తోంది.
తన బాండ్ పేపర్లు తిరిగి ఇవ్వమని అడిగినందుకు తనను చంపుతానని బెదిరిస్తున్నారని రవీందర్ రెడ్డి పేర్కోన్నారు. ఆర్.కృష్ణయ్యతో పాటు, రామకోటి, రామమూర్తి, రాజేందర్, నీలం వెంకటేష్, అంజి, శ్రీనివాస్, అనంతయ్య బెదిరించారని తెలిపారు. ఇప్పటికే ఆర్.కృష్ణయ్యపై ఐపీసీ సెక్షన్ 447,427,506,384 కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసు మానవ హక్కుల సంఘానికి చేరింది.

ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఆఫర్ వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇంతలో కేసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన బీసీ సంఘం నేత.. వెనకబడిన వర్గాల కోసం పాటుపడతానని చెబుతుంటారు. కానీ అతనిపై ఆరోపణలు రావడం కలకలం రేపుతుంది. మరీ రాజ్యసభ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాత గొడవలు బయటకు వచ్చాయి. దీంతో అతని ఇమేజ్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications