కరోనా ఇప్పట్లో కరుణించదు..! దాదాపు ఏడాదిపాటు కోవిడ్ కష్టాలు వెంటాడుతాయంటున్న నిమ్స్ వైద్యులు.. !!
హైదరాబాద్ : కరోనా వైరస్ ఇప్పుడప్పుడే భారతదేశం నుండి వెళ్లిపోయేలా కనిపించడంలేదు. లాక్ డౌన్ ఆంక్షలు పాటిస్తూ దేశ ప్రజలందరూ కరోనాను తరిమికొట్టేందుకు ప్రయత్నింస్తుంటే కరోనా మాత్రం నేను ఇప్పట్టో మిమ్మల్ని విడిచి వెళ్లేది లెదు బాబోయ్ అంటోందట. మరో ఏడాది కాలం పాటు కరోనా మానవాళిని వెంటాడతూనే ఉంటుందని డాక్టర్లు నిర్దారిస్తున్నారు. ఇదే అంశం పట్ల పలువురు సీనియర్ వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ కంటే కరోనా వైరస్ మహమ్మారి అత్యంత ప్రమాదకరమని, రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించడం తప్ప కరోనా వైరస్ కట్టడికి మరో మార్గం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

తాజాగా కరోనా వైరస్ ఇప్పుడప్పుడే దేశ ప్రజలను విడిచిపెట్టేలా లేదంటూ పలువురు సీనియర్ వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ సంపూర్ణ నియంత్రణకు ఆరు నెలల నుంచి ఒక సంవత్సర కాలం సమయం పట్టే అవకాశం ఉందని నిమ్స్ పరిశోధన శాఖ ప్రధాన వైద్యుడు మధుమోహన్‌రావు వెల్లడించారు. ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి బయోసెన్సార్ వ్యవస్థను డెవలప్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
కరోనా పాజిటివ్ చికిత్స కోసం పరిశోధనలు ముమ్మరం చేశామని, ఆవు, మేక పాల ద్వారా కరోనాకు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయని సూచన ప్రాయంగా మధుసూధన్ రావు తెలిపారు. పరీక్షలు చేయడం, చికిత్సలో కొత్త విధానం తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని డాక్టర్ మధుమోహన్‌రావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications