ఒమిక్రాన్ హైటెన్షన్: 10వ తేదీ వరకు ఆంక్షలు, మాస్క్ లేకుంటే రూ.వెయ్యి ఫైన్
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంక్షల అమలును ప్రభుత్వం పొడగించింది. 2వ తేదీ ఆదివారం వరకు ఉన్న ఆంక్షలను.. 10వ తేదీ వరకు ఎక్స్ టెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీచేసింది. డీజీపీ, ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. అప్పటివరకు సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం అమలులో ఉంటుంది. అంతేకాదు రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సభలకు అనుమతి ఇవ్వమని స్పష్టంచేశారు.
ప్రజా రవాణా, దుకాణాలు, మాల్స్‌లో తప్పనిసరిగా కొవిడ్ రూల్స్ పాటించాలని స్పష్టంచేశారు. మాస్క్ తప్పనిసరి అని స్పష్టంచేశారు. భౌతికదూరం విధిగా పాటించాలని పేర్కొన్నారు. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి ఫైన్ తప్పదని స్పష్టంచేశారు. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు మాస్క్ వాడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దానిని పొడగించింది. గుంపులు గుంపులు ఉండొద్దని స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కోరోజు 10 వరకు కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కర్ఫ్యూ తప్ప మరో మార్గం లేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. ఇటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. దానిని పొడగించింది. జనవరి 10వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పస్టంచేసింది.












Click it and Unblock the Notifications