revanth arrest: స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ జోతిమణి, హైదరాబాద్‌కు సల్మాన్ ఖుర్షీద్ బృందం
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించారు. జన్వాడలో కేటీఆర్ ఫాంహౌస్‌ను పరిశీలించేందుకు వెళ్తే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ జరుగుతోండగా ఓ ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారా అని లోక్‌సభలో తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ జోతిమణి ప్రస్తావించారు. ఈ మేరకు స్పీకర్‌కు ఆమె లేఖ కూడా చేశారు. డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు కావాలని అరెస్ట్ చేశారని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని స్పీకర్‌కు తెలిపారు. రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్‌పై వాయిదా తీర్మానం పెట్టాలని కోరారు. అరెస్ట్ చేయడమే కాకుండా బెయిల్ రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లేఖలో పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందో కనుక్కొవాలని ఎంపీలు కోరగా.. తాను సమాచారం తెప్పించుకుంటా అని స్పీకర్ తెలిపినట్టు తెలుస్తోంది.

ఎవరీ జోతి..?
తమిళనాడుకు చెందిన జోతిమణి యాక్టివ్ పొలిటికల్ లీడర్. కరూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ యూత్ లీడర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుచరుల్లో జోతిమణి కూడా ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జోతిమణి.. తమిళంతోపాటు మలయాళం, ఇంగ్లీష్, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు.

హైకోర్టులో పిటిషన్లు..
బెయిల్ కోసం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ తరఫున వాదనలు వినిపించేందుకు ఢిల్లీ నుంచి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని ఐదుగురు అడ్వకేట్ల బృందం హైదరాబాద్ వచ్చింది. హైకోర్టులో రేవంత్ రెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. జన్వాడ పరిధిలో గల నార్సింగి పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని విన్నవించారు. మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దుచేయాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని న్యాయ నిపుణులు వాదనలు వినిపిస్తారు.

ఇదీ వివాదం..
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో మంత్రి కేటీఆరే జీవో 111 నిబంధనలు ఉల్లంఘించి ఫామ్‌హౌస్ నిర్మిస్తున్నారంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించడంతో వివాదం ప్రారంభమైది. తర్వాత అనుమతి లేకుండా ప్రైవేటు నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి.. వెంటనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రేవంత్ రెడ్డిని జైలుకు తరలించినా సంగతి తెలిసిందే.

అదుపులోకి తీసుకొని జైలుకు
మంత్రి కేటీఆర్ బినామీ పేర్లతో ఫాంహౌస్`లో అక్రమంగా కట్టడాలు కడుతూ, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని.. ఈ కట్టడాలను వెంటనే కూల్చాలనే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లి చూపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భద్రతా కారణాలరీత్యా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పిన పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉప్పరపల్లి న్యాయస్థానంలో హాజరపర్చారు. దీంతో కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
-
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications