రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్.. తాను ఇచ్చిన డబ్బులతోనే బిడ్డ పెళ్లి చేశాడు: మంత్రి మల్లారెడ్డి
రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి ఫైరయ్యారు. ఆయన ఓ దొంగ అని.. బ్లాక్ మెయిలర్ విమర్శలు చేశారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆరోపించారు. తాను ఇచ్చిన డబ్బులతోన రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి చేశాడని.. కాదు అని చెప్పే ధైర్యం రేవంత్‌కు ఉందా? అని మల్లారెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు.

రేవంత్ బ్లాక్ మెయిలర్..
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డిని బ్లాక్ మెయిలర్ అన్నారు. ఆయన నిర్వహించేది రచ్చ బండ రాదు.. బట్టేబాజ్ బండ అన్నారు. కోట్లాది రూపాయలు లంచంగా ఇచ్చి పీసీసీ పదవీ తెచ్చుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిది ఐరెన్ లెగ్ అని... ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను నాశనం చేసి బీజేపీలో చేరుతారని అన్నారు.

తప్పని వేధింపులు
టీడీపీలో పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డితో అనేక కష్టాలు పడ్డానని చెప్పారు. మల్కాజ్ గిరి టికెట్ కోసం తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. మల్కాజ్‌గిరి సీటు తనకు రాకుండా అడ్డుకుంనేదుకు కుట్రలు చేశాడని.. చంద్రబాబుకు అన్ని విషయాలు చెప్పి ఎంపీ సీటు తెచ్చుకుని గెలిచానని మల్లారెడ్డి తెలిపారు. డబ్బుల కోసం తనను వేధించాడని.. తనతో డీల్ కోసం మధ్యవర్తులను పెట్టారని చెప్పారు. అడిగినంత ఇవ్వకపోతే కాలేజీలు క్లోజ్ చేయిస్తానని రేవంత్ రెడ్డి బెదిరించారని మల్లారెడ్డి తెలిపారు.

బిడ్డ పెళ్లి ఇలా
తాను ఇచ్చిన డబ్బులతో రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి చేశారని మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.యాదగిరిగుట్టలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని.. రేవంత్ రెడ్డి సిద్దమేనా అని సవాల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేసే రోజు వస్తుందని మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి అండ్ కోటరీ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications