కేసీఆర్, ఆ మంత్రిపై తీవ్ర విమర్శలు: బ్రోకరిజం అంటూ రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి సవాల్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి మల్లా రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన విమర్శలకు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంటులో కేంద్రమే ప్రకటించిందని తెలిపారు.

బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యారంటూ మల్లారెడ్డి
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఎపుడూ బ్రోకర్ దందా చేయలేదన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నా. బ్రోకరిజం చేసి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. మల్లారెడ్డి కళాశాలకు పార్లమెంటే క్లీన్ చీట్ ఇచ్చింది. నేను కబ్జా చేసినట్లు రేవంత్ నిరూపించాలి!. రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయినట్లు మొదటి సంతకాలంటూ వాగ్ధానాలు చేస్తుండు. తెలంగాణలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే నా పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డికి తొడగొట్టి సవాల్ విసిరిన మల్లారెడ్డి..
రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయన్నారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని, అందులో అసైన్డ్, చెరువులకు సంబంధించినదని, కబ్జా భూమి లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని తెలిపారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. అంతేగాక, రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ సవాల్ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తాను. మంత్రి పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా. రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో అని రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు.

కేసీఆర్, మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇది ఇలావుండగా, మూడుచింతల వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన రేవంత్ గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి భూములు కబ్జా చేసినట్టు ఆరోపించారు. మల్లారెడ్డి సగం జోకర్ తీవ్ర విమర్శలు చేశారు. భూములు అమ్మినా..? కొన్నా..? మల్లారెడ్డికి మాములు ఇవ్వాలని ఆరోపణలు గుప్పించారు. జవహర్ నగర్‌లో తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టిండని మండిపడ్డపడ్డారు రేవంత్. సూరారంలో చెరువును కబ్జా చేసి హాస్పిటల్ కట్టినట్టు ఆరోపణ చేశారు. ఇలా సర్కార్ భూములు కబ్జా చేసి.. ఆస్పత్రి, కాలేజీలు కట్టాడని.. మల్లారెడ్డి యూనివర్సిటీకి అనుమతి వచ్చిన భూమి కూడా దొంగ భూమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే.. మంత్రి మల్లారెడ్డి భూములపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అది తప్పు అని తేలితే నేను ఏ శిక్ష కైనా సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.

మోసం.. కేసీఆర్ రెండు ఒక్కటే..
మూడు చింతల పల్లిలో దీక్ష విరమించిన అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్.. చింతమడక చీటర్ అని దుయ్యబట్టారు. మూడు చింతలపల్లిలో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ఇళ్లే ఉన్నాయన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లడానికే రోడ్డు పెద్దగా చేసిండు.. రోడ్డుపైకి చేయడంతో ఇళ్లు కిందికి అయిపోయాయని.. వాన కాలంలో వాన నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయన్నారు. ఊరిలో ఇంతవరకు కమ్యూనిటీ హల్ కూడా కట్టలేదని మండిపడ్డారు రేవంత్. దత్తత తీసుకున్న గ్రామంలో ఒక్క పని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్లు పలికే భూములు కూడా గుంజుకున్నారని విమర్శించారు.
మోసం, కేసీఆర్ రెండు ఒక్కటేనని వ్యాఖ్యానించారు.
Recommended Video

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్న రేవంత్..
కేసీఆర్‌కు హుజురాబాద్‌లో ఓటమి భయం పట్టుకుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజం.. కేసీఆర్ కుటుంబానికి మస్తు చేసింది.. తెలంగాణ కోసం కొట్లాడిండు అని రెండు సార్లు సీఎంను చేసిండ్రు.. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు? అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరిస్తే.. తెలంగాణ దొంగల పాలైందన్నారు. రాష్ట్రాన్ని అడవి పందుల్లా.. దోచుకుంటున్నారని మండిపడ్డారు. దళిత, గిరిజనులందరికి బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ దండోరా సభలతో.. కేసీఆర్ అనే ఎలుక బయటికొచ్చిందని సెటైర్లు వేశారు. కేసీఆర్.. జపాన్ ఎలుక లాంటి వాడు.. ప్రమాదాన్ని ముందే గ్రహించి బయటికొచ్చిండు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీ టైం ఐపోయింది.. ఇక నీవు ఇంటికేనని ధ్వజమెత్తారు. 20 ఏళ్ళు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లు. కేసీఆర్ కు 20 నెలల భయం పట్టుకుంది. మొదటి సారి కేసీఆర్‌లో భయం కనిపిస్తుంది అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తరువాత పార్టీలో సీనియర్లు ఎవరు బ్రీఫ్ చేయలేదు. ఆఖరుకు కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారు. టీఆరెఎస్ లో ఉద్దండులు మీడియా ముందు కు రావడానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇక భవిష్యత్‌లో టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కేసీఆర్ పక్కన కూర్చోడానికి బయపడుతున్నారన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఒంటరి వాడు అయ్యారు. కేసీఆర్ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు.. ఆ భ్రల్లోనుంచి జనాలు ఇప్పుడు బయటకు వస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications