హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షాలు, వరదల వల్ల చిన్న ప్రమాదం జరిగినా దానికి సీఎం కేసీఆర్ దే బాధ్యత: రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో జనజీవనం అస్తవ్యస్తమైందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పెను విపత్తును అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సూచించారు.

కడెం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజల విషయంలో కేసీఆర్ తక్షణం స్పందించాలి

కడెం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజల విషయంలో కేసీఆర్ తక్షణం స్పందించాలి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు కింద అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారని, భారీ వరదల కారణంగా గ్రామాల్లోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారని, పాత కట్టడాలు ప్రమాదంలో ఉన్నందున, అవి కూలిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే స్పందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరం స్పందించకుంటే పెను ప్రమాదం తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. సీఎం వెంటనే సంబంధిత శాఖలన్నింటితో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రణాళికలు రూపొందించి సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు.

17 లోక్‌సభ నియోజకవర్గాలకు 17 మంది మంత్రుల అధ్యక్షతన క్షేత్రస్థాయి బృందాలు ఏర్పాటు చెయ్యాలి

17 లోక్‌సభ నియోజకవర్గాలకు 17 మంది మంత్రుల అధ్యక్షతన క్షేత్రస్థాయి బృందాలు ఏర్పాటు చెయ్యాలి


భారీ వర్షాలు మరియు వరదల అనంతర పరిణామాలను నియంత్రించడానికి యుద్ధప్రాతిపదికన వరద సహాయక చర్యలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో వరద పరిస్థితిని సమీక్షించడానికి వెంటనే ఒక ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు రేవంత్ రెడ్డి. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 17 మంది మంత్రుల అధ్యక్షతన సీనియర్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వ్యవసాయం, తాగునీరు, వైద్యం, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలు, విపత్తు నిర్వహణ అధికారులతో క్షేత్రస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని రేవంత్‌ రెడ్డి సూచించారు. 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

మంత్రులు, అధికారులు పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలి

మంత్రులు, అధికారులు పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలి


ప్రతి జిల్లాలోనూ మంత్రులు, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించి వరద సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ 17 కమిటీలనూ కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమన్వయం చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని, వరదల కారణంగా ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రాలేని ప్రాంతాలను వెంటనే గుర్తించి వారికిఅక్కడ ఆహారం, తాగునీరు మరియు ఇతర నిత్యావసరాలను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

 ప్రెస్ మీట్ లతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు

ప్రెస్ మీట్ లతో కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు

ప్రాజెక్టులు, చెరువుల వద్ద నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, కట్టలు తెగే ప్రమాదం ఉన్న చోట హెచ్చరికలు జారీ చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన వ్యూహాలపై ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టకుండా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లు పెడుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా గాఢనిద్ర నుంచి మేలుకో వలసిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి సూచించారు .

సీఎం ఎక్కడున్నారు అన్నది సామాన్యులకు తెలియటం లేదు

సీఎం ఎక్కడున్నారు అన్నది సామాన్యులకు తెలియటం లేదు


ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అన్నది సామాన్య ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని, అంతగా సీఎం కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత విపత్తు దృష్ట్యా సీఎం తక్షణమే స్పందించి వరద సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ ప్రమాదం జరిగినా, చిన్నపాటి నష్టం వాటిల్లినా దానికి సీఎం కేసీఆర్ నే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

English summary
Revanth Reddy said that CM KCR should be responsible for even a small incident happens to public due to rains and floods. Revanth Reddy suggested that high-level committees should be formed under the chairmanship of KCR and flood relief measures should be undertaken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X