రూ.100 ఇచ్చా.. చిల్లర తీసుకోలే.. సజ్జనార్‌కు ట్వీట్, ఫోన్ పే ద్వారా చెల్లింపు
సోషల్ మీడియా ఎలా మారిందంటే.. ఏ చిన్న సమస్య అయినా ప్రపంచం దృష్టికి వెళుతుంది. వెళ్లడమే కాదు ఆ ఇష్యూ సాల్వ్ కూడా అవుతుంది. ఇటీవల ఓ స్టూడెంట్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశాడు. విషయం ఏంటంటే.. అతను బస్సులో ట్రావెల్ చేశాడు. కానీ రూ.100 ఇచ్చి చిల్లర తీసుకోలేదు. విషయం సజ్జనార్‌కు ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన ఆయన డిపో అధికారులకు సమాచారం అందించారు. వారు విచారణ చేసిన తర్వాత మిగిలిన డబ్బులను ఆ విద్యార్థికి ఫోన్ పే ద్వారా అందించారు.
సీతాఫల్ మండికి చెందిన లిక్కిరాజు బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల బస్సు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కండక్టర్ కు రూ. 100 ఇచ్చాడు. చిల్లర లేదని టికెట్ వెనున రూ. 80 రాశాడు. సికింద్రాబాద్ రాగానే..లిక్కిరాజు దిగిపోయాడు. దిగిన తర్వాత..చిల్లర తీసుకోలేదని తెలుసుకున్నాడు. అప్పటికే బస్సు వెళ్లిపోయింది. జేబులో ఒక్క రూపాయి లేకపోవడంతో నడుచుకుంటూ ఇంటి వరకు వెళ్లాడు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్యాగ్ చేస్తూ తన బాధ వెళ్లగక్కాడు. వెంటనే స్పందించిన ఆయన జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డిని పరిశీలించాలని సూచించారు. శనివారం ఆ ప్రయాణికుడికి చెల్లించాల్సిన రూ. 80ని డిపో మేనేజర్ ఫోన్ పే ద్వారా పంపించారు. ఎండీ, డిపో మేనేజర్ల స్పందనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ఓ మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. [email protected] మెయిల్ ఐడీలో కానీ, @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతా ద్వారా కానీ, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు.
Recommended Video
ఆర్టీసీలో సమూల మార్పులు జరుగుతున్నాయి. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. ఒక్కో విభాగం మీద దృష్టిసారించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేశారు. మరోవైపు తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించుకున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీని కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం తార్నాక ఆర్టిసీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవల ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications