ఛలో ట్యాంక్ బండ్ పై అణచివేత..! ఫ్లై ఓవర్ల మూసివేత..! నగరం నుండి కార్మికుల గెంటివేత..!!
హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె 37వ రోజుకు చేరుకుంది. గత 37 రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలుపుతూనే ఉన్నారు ఆర్టీసి కార్మికులు. వంటా వార్పు, మానవహారాలు, కుటుంబ సభ్యులతో నిరాహార దీక్షలు, రహదారులు దిగ్బంధం తదితర కార్యక్రమాలతో ప్రభుత్వంపైన వ్యతికరేకత బహిర్గతం చేస్తునే ఉన్నారు. ఇక శనివారం లక్ష మందితో ఛలో ట్యాక్ బండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆర్టీసి జేఏసి ప్రభుత్వంపైన ప్రత్యక్ష పోరాటానికి తెర తీసింది.

ఛలో ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం.. కార్మికులను అడ్డుకున్న పోలీసులు..
కార్మికులు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి అనుమతి లేదంటూ, ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో చేరితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఐతే తాము ఎలాగేనా ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని జేఏసీ నేతలు ప్రకటించారు. వీరికి అండగా అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తే అవకాశం ఉందని బావించిన పోలీసులు ఆర్టీసి కార్మికులను అరెస్టు చేసారు. నగరం నలు వైపుల గట్టి నిఘా ఏర్పాటు చేసి ఉద్యోగులను ట్యాక్ బండ్ పరిసరాలకు వెళ్లకుండా నిలువరించారు.

నగరం అష్ఠ దిగ్బంధనం.. కార్మికుల అరెస్టుతో అట్టుడికిన హైదరాబాద్..
ఇదిలా ఉండగా అయోధ్య కేసు తీర్పు వల్ల తెలంగాణలో జరుగుతున్న కీలక పరిణామాలు మీడియాలో పెద్దగా కనిపించ లేదు. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ను మరింత ఉదృతం చేసేందుకు శనివారం ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున దీనిని విజయవంతం చేయాలని ఆర్టీసీ నాయకులు తలపెట్టారు. దీన్ని విఫలం చేసేందుకు ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. సిటీ నలుమూలలా అష్ట దిగ్బంధనం చేసి కార్మికులను అడ్డుకున్నారు పోలీసులు.

రాజకీయ నేతల గృహనిర్బంధం.. నిరసన వ్యక్తం చేసిన నేతలు..
శనివారం తెల్లవారేలోపు ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందిని అదుపులోకి తీసుకోవడం కూడా సంచలనంగా మారింది. కాంగ్రెస్ నేతలను చాలా వరకు గృహ నిర్బంధం చేసిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. హిమాయత్ గర్ లిబర్టీ వద్ద ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ నాయకులతో పాటు దీనికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల నేతలను కూడా అరెస్టు చేశారు.

సీఎం పై ఆర్టీసి ఉద్యోగుల ఆగ్రహం.. అణచివేస్తే ఉద్యమం ఆగదంటూ హెచ్చరికలు..
జిల్లాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేయడమే కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో ట్యాంక్‌బండ్ మూసేశారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతా బాద్ ఫ్లై ఓవర్ తో పాటు ట్యాంక్ బండ్ కు వచ్చే రహదారులన్నీ మూసేసారు పోలీసులు. అంతే కాకుండా ట్యాంక్ బండ్ చుట్టూ నిఘా పెట్టారు. ట్రాఫిక్ మళ్లించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే ట్యాంక్‌బండ్‌లో ట్రాఫిక్ ను నియత్రించారు. ఇదిలా ఉండగా ఇంతటి అణచివేతను ఎన్నడూ చూడలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ నిరసనలను కొనసాగిస్తామని పునరుద్గాటించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications