అడవీ బిడ్డల వీరత్వానికి ప్రతీక సమ్మక్క- సారాలమ్మ: జనసేనాని పవన్ కల్యాణ్
మరికొన్ని గంటల్లో మేడారం జాతరకు అంకురార్పణ జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని.. వన దేవతలను దర్శించుకోవాలని సూచన చేశారు. పోలీసు/ ఇతర అధికారులతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి గాక.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా గిరిజన దేవతలను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తుంటారు. కరోనా వల్ల.. గత ఏడాది సరిగా జరగలేదు. ఏడాది గ్యాప్ తర్వాత.. వచ్చే ఏడాది జాతరను నిర్వహిస్తారు.

పవన్ విషెస్
రాష్ట్రానికే ప్రత్యేకంగా నిలిచే మేడారం జాతర గురించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో వైభవంగా జరిగే వన జాతర దేశానికే తలమానికం అని పవన్ కల్యాణ్ కీర్తించారు. తెలంగాణ వాసులతోపాటు, దేశ ప్రజలు అందరినీ దుష్ట శక్తుల నుంచి వనదేవతలు కాపాడాలని, ప్రజలను చల్లగా చూడాలని ప్రణామాలు అర్పిస్తున్నామని పవన్ తెలిపారు.

హెలికాప్టర్ సేవలు
ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. ఇక్కడ నిర్వహించే సమ్మక్క-సారలమ్మ వేడుకలు ఆసియాలో అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచాయి. మేడారం జాతరకు వెళ్లేవారికోసం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తంబి ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ హెలికాప్టర్ సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.

రూ.20 వేలు..
హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్లు నడపనుంది. ఒకరికి రానుపోను చార్జీలు రూ.19,999 అని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి మేడారంకు రూ.75,000 చెల్లించాలి. మేడారం జాతర విహంగ వీక్షణం కోసం మరో రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. హెలికాప్టర్‌లో వెళ్లిన వారికి సిబ్బందే దర్శనం చేయించి.. తిరిగి పంపిస్తారు.












Click it and Unblock the Notifications