ముఖ్యమైన వ్యక్తిని కలిసిన సానియా మీర్జా
మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, భారత రాష్ట్ర సమితికి చెందిన వద్దిరాజు రవిచంద్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు మరో ముగ్గురు అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయగా వాటిని ఎన్నికల సంఘం తిరస్కరించింది. పై ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
టెన్నిస్ స్టార్ సానియా మిర్జా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన అనిల్ కమార్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్టు పెట్టారు. 'కంగ్రాట్స్ అన్నా.. ఎంపీగా మీరు గొప్ప గొప్ప పనులు చేయాలని ఆశిస్తున్నా..' అంటూ పోస్టులో రాసుకొచ్చారు. అనిల్ తో తాను గతంలో దిగిన ఫోటోను పోస్టు చేశారు సానియా. తన భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు సానియా విడాకులిచ్చారు. చాలాకాలం వేర్వేరుగా ఉన్న తర్వాత ఇటీవలే విడాకులు తీసుకున్నారు. షోయబ్ పాకిస్థాన్ నటి సనా జావేద్‍ను మూడో వివాహం చేసుకున్నాడు. షోయబ్ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. సానియా హైదరాబాద్ లోనే ఉంది.

భారత్‌లో టెన్నిస్‌కు గ్రామర్‌ను, గ్లామర్‌ను అద్దిన సానియా 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. ఆమె వ్యక్తిగత సంపద 26 మిలియన్ డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో రూ.201 కోట్లు. తన కెరీర్ లో సానియా మొత్తం ఆరు డబుల్స్ టైటిల్స్ ను గెలుచుకుంది. తన కెరీర్ మొత్తంమీద 43 డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కూడా గెలుచుకుంది. 2016లో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాలో సానియా కూడా చోటు సంపాదించింది.












Click it and Unblock the Notifications