Secunderabad : సికింద్రాబాద్ కు అన్ని రైళ్ల రద్దు-ఉన్నతాధికారులతో జీఎం అత్యవసర భేటీ

ఆర్మీలో అగ్నిపథ్ పథకం కింద కేంద్రం చేపట్టబోతున్న రిక్రూట్ మెంట్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలు హైదరాబాద్ నూ తాకాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇవాళ ఉదయం నుంచి నిరసనలు చేపట్టిన అభ్యర్ధులు హింసకు దిగారు. రైల్వే స్టేషన్లో పలు రైళ్లను తగులబెట్టారు. స్టేషన్ లో ప్లాట్ పారంపైున్న సామాగ్రిని ధ్వంసం చేశారు. ట్రాక్ లపై టైర్లు తగులబెట్టి ఆందోళన చేపట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

సికింద్రాబాద్ స్టేషన్లో చోటు చేసుకున్న హింస నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అత్యవసర చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్ స్టేషన్ కు రావాల్సిన అన్ని రైళ్లను రద్దు చేసిది. అలాగే స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లను కూడా రద్దు చేసింది. స్టేషన్ లో సాధారణ పరిస్ధితులు నెలకొన్న తర్వాత తిరిగి రైళ్ల రాకపోకల్ని కొనసాగించే అవకాశం ఉంది. దీంతో స్టేషన్ లో ఇవాళ టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరిన ప్రయాణికులు కూడా అర్దాంతరంగా రైళ్లు రద్దు కావడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

scr stop all trains to Secunderabad in wake of agnipath protests, gm emergency meeting

మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఘటనలపై దక్షిణమధ్య రైల్వే జీఎం ఇవాళ రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్లో హింసకు దారి తీసిన పరిస్ధితుల్ని ఉన్నతాధికారులకు వివరించారు. పరిస్దితుల్ని అదుపు చేసేందుకుప తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ఇప్పటికే రైల్వే పోలీసులు కాల్పులు జరిపి మరీ ఆందోళనకారుల్ని స్టేషన్ నుంచి బయటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు కూడా అయిన నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+