హమ్మయ్యా.. సోమాలియన్ దొరికేశాడు.. టిమ్స్‌కు తరలింపు..
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపింది. అయితే పాజిటివ్ వచ్చిన విదేశీ మహిళకు టిమ్స్‌లో చికిత్స అందిస్తోండగా.. మరో విదేశీ వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో పోలీసులు, వైద్య సిబ్బంది పరుగు తీశారు. ఎట్టకేలకు అతనిని పట్టుకొని.. టిమ్స్‌కు తరలించారు. మరో బాలుడికి కూడా ఒమిక్రాన్ వచ్చింది.. కానీ ఆ పిల్లాడు హైదరాబాద్ వయాగా వచ్చాడు. వెంటనే బెంగాల్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ఒమిక్రాన్ కలకలం..
హైదరాబాద్‌లో రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం అయింది. బంజారాహిల్స్ పారమౌంట్ కాలనీలో బాధితుడిని కనుగొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌తో తప్పిపోయిన సోమాలియన్‌ను బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీ వద్ద సిటీ పోలీసులు అదుపులోకి తిసున్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.

12వ తేదీన రాక
డిసెంబర్ 12వ తేదీన షార్జా నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అతడికి 12వ తేదీన కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతన్ని గచ్చిబౌలి లోని టిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నారు.అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు డీహెచ్ తెలిపారు. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించడం జరిగిందని వెల్లడించారు.

కెన్యా, సోమాలియా
కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు, జీనోమ్ సెక్వెన్సింగ్ లో మంగళవారం రాత్రి నిర్ధారణ అయ్యిందని తెలిపారు. డిసెంబర్ 12న సొమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ లో ఆ వ్యక్తికి కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ కూడా టోలిచౌకి ఏరియాకు చెందిన వారని పేర్కొన్నారు. కెన్యా, సోమాలియాకు చెందిన వీరిద్దరూ కూడా టోలిచౌకీలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి కుటుంబ సభ్యులను గుర్తించి హోం ఐసోలేషన్‌లో ఉంచారు.

కేసుల వర్రీ
భారత్ లో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు ఏపీలో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. అతనికి మళ్లీ టెస్ట్ చేయగా..నెగెటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి ఏపీలో ఒమిక్రాన్ కేసులు లేనట్టేనని భావిస్తున్నారు. తెలంగాణలో రెండు కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications