కాంగ్రెస్‌కు వరుస షాకులు.. అంజన్ కుమార్ అసంతృప్తి.. భిక్షపతి యాదవ్‌ను బుజ్జగిస్తున్న నేతలు..
దుబ్బాక ఉపఎన్నికతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీలో ఎన్నికలకు ముందే షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండానే గాంధీభవన్‌లో టికెట్లు కేటాయిస్తున్నారని పార్టీ నాయకత్వంపై అంజన్ కుమార్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కొరవడిందా అన్న చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం...
శేరిలింగంపల్లి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్‌లు పార్టీకి ఇప్పటికే రాజీనామా చేశారు. రేపో మాపో ఆ ఇద్దరూ బీజేపీ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. భిక్షపతి యాదవ్‌ను బుజ్జగించేందుకు బుధవారం(నవంబర్ 18) ఉదయం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు ఆయన నివాసానికి వెళ్లారు. అయినప్పటికీ భిక్షపతి యాదవ్ రాజీనామాపై వెనక్కి తగ్గకపోవడంతో రేవంత్ సహా పలువురు నేతలు వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఆయనతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌కు చావో రేవో...
హైదరాబాద్ మాజీ మేయర్,కాంగ్రెస్ నేత బండ కార్తీక కూడా ఆ పార్టీకి రాజీనామా చేసిన షాకిచ్చిన సంగతి తెలిసిందే. గ్రేటర్ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బుధవారం కార్తీక ఆ పార్టీలో చేరనున్నారు. ఈసారి గ్రేటర్ పీఠం మహిళలకే కేటాయించడంతో మరోసారి కుర్చీపై ఆమె ఆశలు పెట్టుకున్నారు.దుబ్బాక ఉపఎన్నికలో బోల్తా కొట్టిన కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా తయారయ్యాయి. ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టితే... ఇక రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.
Recommended Video

డిసెంబర్ 1న పోలింగ్...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల షెడ్యూల్,నోటిఫికేషన్ మంగళవారం(నవంబర్ 17) విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా... డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. బుధవారం(నవంబర్ 18) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 20గా నిర్ణయించారు. నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఈసారి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో 2016 నాటి రిజర్వేషన్లనే కొనసాగించనున్నారు. మొత్తం 14 రోజుల్లో డిసెంబర్ 6వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications