ఆమెకు 17, అతనికి 29: 12 ఏళ్ల తేడా.. ప్రేమ, పెళ్లి వద్దన్నందుకు అతని గదిలోనే ఆత్మహత్య..?
ఏం జరిగిందో క్లారిటీ లేదు. కానీ యువకుడి గదిలో మాత్రం మైనర్ బాలిక విగతజీవిగా కనిపించింది. అతను మాత్రం.. తనను ప్రేమ పేరుతో వేధించిందని.. ఏజ్ గ్యాప్ ఉండటంతో అంగీకరించలేదు అని చెబుతున్నాడు. కానీ బాలిక తల్లి మాత్రం.. అతనే చంపి కబుర్లు చెబుతున్నాడని ఆరోపిస్తున్నారు. భాగ్యనగర నడిబొడ్డున జరిగిన బాలిక బలవన్మరణం కేసు పోలీసులకు సవాల్ విసిరింది. కేసు దర్యాప్తును అన్నీ కోణాల్లో చేపడుతున్నామని.. త్వరలో బాలిక మృతిపై నిజానిజాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.

మూసాపేటలో మకాం..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన చందర్ దంపతులు మూసాపేటలో ఉంటున్నారు. వీరికి కూతురు, కుమారుడు.. కూతురు రమ్య అలియాస్ కల్యాణి ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసింది. కానీ ఇంటి పక్కనే ఉండే రాజుపై మనసు పడేసుకుంది. అతనితో మాటల్లో పడి ప్రేమ మత్తులో దిగిపోయింది. కానీ రాజు మాత్రం.. తనకు ఆమెపై అలాంటి భావనలే లేదని చెబుతున్నాడు. ఇదిలాఉండగా రమ్య తన ప్రేమను రాజుకు ప్రపోజ్ చేసింది. దానిని రాజు నిర్వందంగా తోసిపుచ్చాడు. కాదు కూడదు అని తెగేసి చెప్పాడు. కట్ చేస్తే అతని గదిలోనే రమ్య విగతజీవిగా కనిపించింది.

తిరిగి గదిలోకి..
రాజుతో మాట్లాడక అతని గది నుంచి రమ్య వెళ్లిపోయింది. తర్వాత అతను నిద్రలోకి జారుకున్నాడు. కానీ తిరిగి అతని గదికి రమ్య వచ్చింది. అతని గదిలోని ఆత్మహత్య చేసుకుంది అని రాజు చెబుతున్నాడు. లేచి చూశాక.. రమ్య చలనం లేకుండా కనిపించింది. వెంటనే అతను కూకట్ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... ఏం జరిగింది అని ఆరాతీశారు. జరిగిన విషయం అంతా పూసగుచ్చి మరీ చెప్పాడు రాజు.

రాజే చంపాడు..
రమ్య చనిపోయిందని తెలుసుకొని అక్కడికి తల్లి చేరుకుంది. బోరుమని విలపించింది. ఎలా జరిగిందని.. పోలీసులను ఆరాతీసింది. రమ్య ఆత్మహత్య చేసుకుందని వారు.. చెప్పగా తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని.. రాజే చంపాడని ఆరోపించింది. దీంతో రమ్య మృతి కేసును పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

12 ఏళ్ల తేడా..
రమ్యకు 17 ఏళ్లు.. రాజుకు 29 ఏళ్లు.. తమ మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంది అని రాజు చెబుతున్నాడు. అందుకే రమ్య ప్రేమను తిరస్కరించానని చెప్పాడు. తాను నో చెప్పడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని వివరించాడు. తన గదిలో సూసైడ్ చేసుకోవడంతో.. తనపై ఆరోపణలు చేయడం సరికాదని అతను అంటుండగా.. రాజు ప్రమేయంతోనే హత్య జరిగిందని రమ్య పేరంట్స్ ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications