హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ ...రెండో సారి అదే రిపీట్.... కేసీఆర్ క్యాబినెట్ లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే?

|
Google Oneindia TeluguNews

సండ్ర వెంకటవీరయ్య... తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్న ఎమ్మెల్యే. టిడిపి నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే గా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య గత కొంతకాలంగా పార్టీ మారుతారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ ఫిబ్రవరి 19న మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్న తరుణంలో సండ్ర వెంకటవీరయ్య టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందుకే టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించిన చంద్రబాబు సండ్ర వెంకటవీరయ్యను టీటీడీ బోర్డు మెంబర్ గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గతంలో తలసాని ... తాజాగా సండ్ర... ఫిరాయింపు నేతలకు మంత్రివర్గంలో స్థానం

గతంలో తలసాని ... తాజాగా సండ్ర... ఫిరాయింపు నేతలకు మంత్రివర్గంలో స్థానం

ఈనెల 19న క్యాబినెట్ విస్తరణ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విస్తరణలో పదిమందికి స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే ఆ పదిమందిలో ఫిరాయింపు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కేబినెట్లో సైతం ఫిరాయింపు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కట్టబెట్టిన కెసిఆర్ ఈ దఫా కేబినెట్లో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే సండ్ర కు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారడానికి మంత్రి పదవి ఆఫర్ చేసిన నేపథ్యంలో 19న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో సండ్ర కు స్థానం దక్కనుంది అని టాక్ వినిపిస్తోంది.

 సండ్ర టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చెయ్యనిది అందుకే

సండ్ర టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చెయ్యనిది అందుకే

గత ఎన్నికల్లో టిడిపి నుండి విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇచ్చినప్పటికీ బోర్డు మెంబర్ గా ప్రమాణస్వీకారం చేయలేదు. టిఆర్ఎస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్న కారణంగానే ఆయన బోర్డు మెంబర్ గా ప్రమాణస్వీకారం చేయలేదని తెలుస్తోంది. ఎప్పుడైతే సండ్ర వెంకటవీరయ్య టిఆర్ఎస్ లో చేరతారని, మంత్రిగా అవకాశం కూడా దక్కనుందని తెలిసిందో వెంటనే టిటిడి బోర్డు మెంబర్ గా సండ్ర పదవిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లో చోటు ..అసహనంలో టీఆర్ఎస్ ఆశావహులు

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లో చోటు ..అసహనంలో టీఆర్ఎస్ ఆశావహులు

ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ లోని చాలా కాలంగా మంత్రి పదవి కోసం ఆశావహులు ఎదురు చూస్తూ ఉంటే గత కేబినెట్లో సీఎం కేసీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అవకాశమిచ్చారు. దీంతో గత కేబినెట్లో అవకాశం రాని వారు చాలా మంది ఈసారైనా తమకు అవకాశం వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఫిరాయింపు ఎమ్మెల్యే సండ్ర కు స్థానం కల్పిస్తారు అని తెలియడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది.

ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతికి పయనమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పై చంద్రబాబు నాయుడుతో రేపు జరగనున్న పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. సండ్ర వెంకటవీరయ్య పార్టీ మార్పుపై ప్రధానంగా చర్చ జరగనుంది. కేసీఆర్ క్యాబినెట్ లో సండ్రకు స్థానం పక్కా అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో కాకుండా ముందుగానే సండ్రకు క్యాబినెట్ లో బెర్త్ కన్ఫార్మ్ చెయ్యటంతోనే సండ్ర కారెక్కేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం .

English summary
The much awaited cabinet expansion by Telangana chief minister K Chandrasekhar Rao will take place on February 19. TDP MLA Sandra Venkata veeraiah likely to join in TRS party. Everyone thought MLA sandra venkata veeraiah will jump onto TRS party a very long back ago. But now he is ready to jump to the TRS party because he might be having a chance to become a Minister in kcr cabinet expansion.   
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X