రంగంలోకి స్మిత.. హెల్ప్‌లైన్ ఏర్పాటు.. 50 బెడ్స్ ఆస్పత్రి.. ఆక్సిజన్ కూడా..

కరోనా వైరస్ జనాలను కకావికలం చేస్తోంది. వైరస్ రూపాంతరం చెందుతూ ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈ సమయంలో మనసున్న మరాజులు ముందుకొస్తున్నారు. వివిధ రూపాల్లో ఆదుకుంటున్నారు. అలా గాయనీ స్మిత కూడా మంచి మనసును చాటుకున్నారు. సేవా కార్యక్రమాలను చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్మిత అండ్ కో చేస్తోన్న మంచి పనులను నెటిజన్లు అభినందిస్తున్నారు.

కరోనా కష్టకాలంలో నేను సైతం అంటూ ముందుకు వచ్చారు గాయనీ స్మిత. ఏపీ ఎంటర్ పెన్యూర్ ఆర్గనైజేషన్, ఈషాకు చెందిన అలై ఫౌండేషన్ సహకారంతో స్మిత కేర్ పేరుతో సేవాకార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలలో ఆరు ప్రాంతాలలో కోవిడ్ బాధితుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడ, పశ్చిమ గోదావరి, అనంతపురం, శ్రీకాకుళం, హైదరాబాద్, విశాఖపట్నంలో హెల్ప్ లైన్స్‌ను ఏర్పాటు చేసి బాధితులకు సహాయాన్ని అందిస్తున్నామని వివరించారు.

singer smitha establish helpline for covid

హైదరాబాద్‌లో సైబ‌రాబాద్ పోలీస్ కమిషనరేట్‌, మెడికొవర్ సంయుక్త ఆధ్వర్యంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని స్మిత తెలిపారు. దీంతోపాటు ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆరు వందల బెడ్స్‌ను ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామన్నారు. కరోనా బాధితులు అధైర్య పడకుండా వారికి టెలిఫోన్‌లోనూ వైద్య సహకారం, సలహాలూ సూచనలు అందించే విధంగా ఓ డాక్టర్ల బృందాన్ని నియమించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

హైదరాబాద్ - 99514 02666, విజయవాడ & ఏలూరు - 99850 70997, 90146 77932, అనంతపురం, శ్రీకాకుళం - 90326 40666 ఫోన్ చేసి డాక్టర్లతో సంప్రదింపులు జరపాలని కోరారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు 97035 89022 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+