మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్‌గానే
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా లేదని వైద్యులు తెలిపారు. కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.

గత కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోచారం కోరారు. లక్షణాలు ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. స్పీకర్‌కు కరోనా సోకడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇటు తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 27,348 శాంపిల్స్ పరీక్షించగా, 406 మందికి పాజిటివ్ వచ్చింది.
హైదరాబాద్‌లో 177, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వచ్చాయి. ఇంకా 581 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,29,873 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,22,667 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 3,095 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications