sri reddy: ఈసారి బిగ్ షాట్స్, రియల్టర్స్‌పై గురి, సాయం చేయరా అని పంచ్‌లు

శ్రీ రెడ్డి.. ఏం చేసినా సంచలనమే.. ఈ ఫిరంగి ఎప్పుడు ఏం కామెంట్ చేస్తుందనే భయాందోళన వ్యక్తమవుతోంది. కొందరినీ టార్గెట్‌గా చేస్తూ.. కామెంట్లు చేయడం.. వీడియోలను వదులుతుంటుంది. ఇప్పుడు సెలబ్రిటీల విరాళాలు ఎందుకు ఇవ్వడం లేదని స్టార్ట్ చేశారు. తమిళ స్టార్స్‌ను చూసి నేర్చుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. రియల్టర్లు, బిగ్ షాట్స్‌ను కూడా ఏకీ పారేశారు. కరోనా వల్ల సమయం బాగోలేకుంటే.. చనిపోతే ఏం చేస్తారని అడిగారు. మధ్య తరగతి జనాలకు హెల్ప్ చేస్తే ఏం పోతుందని ఫైరయ్యారు.

తమిళ స్టార్స్ అలా..

తమిళ స్టార్స్ అలా..

శ్రీ రెడ్డి ఇటీవల రాజకీయ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలపై రియాక్ట్ అవుతున్నారు. కరోనా కష్టకాలంలో మిడిల్ క్లాస్ ప్రజల కష్టాలు, సెలబ్రిటీల సాయం గురించి మాట్లాడారు. 'తమిళనాడులో అజిత్, విజయ్ సేతుపతి, రజినీకాంత్, టెక్నీషియన్స్, డైరెక్టర్లు ఇలా అందరూ కొన్ని కోట్ల విరాళాలు ఇస్తుంటే మన ఆంధప్రదేశ్‌లో ఉన్న సెలబ్రిటీలు ఎక్కడ పోయారు అని శ్రీ రెడ్డి ప్రశ్న సంధించారు. జనం సినిమా చూస్తే గానీ వాళ్లకు అన్ని ఆస్తులు ఉండవు. మరి ఈ పరిస్థితుల్లో డబ్బులు తీసి సీఎం జగన్ సహాయ నిధికి ఇవ్వడానికి ప్రాబ్లమ్ ఏంటి? అని అడిగారు

డబ్బులు మూటగట్టి..

డబ్బులు మూటగట్టి..

పెద్ద పెద్ద పరిశ్రమలు కట్టుకొని బాగా సంపాదిస్తున్నారు కదా మరీ డబ్బులు తీయడానికి ఏంటి మాయరోగం అని తనదైన శైలిలో రెచ్చిపోయారు. భూ దందాలు చేసుకొని సంపాదిస్తున్న రియల్టర్స్‌ను కూడా వదల్లేదు. మీరు కూడా డబ్బులు తీయండి అని హుంకరించారు. కరోనా వచ్చి అందరూ చస్తుంటే ఆ డబ్బులు దాచుకొని ఇంకా ఏంచేస్తారు అని నిలదీస్తున్నారు. ఏదో ఒక రోగం వచ్చి చస్తారు అని బూతులు తిట్టారు. ఇక చాలు వెంటనే సీఎం సహాయనిధికి డబ్బులు పంపించండి అంటూ రెచ్చిపోయారు.

వారి బాధలు అన్నీ ఇన్నీ కావు

వారి బాధలు అన్నీ ఇన్నీ కావు


చావలేక బ్రతకలేక మిడిల్ క్లాస్ జనం నలిగిపోతున్నారని శ్రీ రెడ్డి చెప్పారు. వాళ్ళ జీవితం తలచుకుంటే తనకు డిప్రెషన్ కలుగుతుందని చెప్పారు. మీ పిల్లలు చదువుకుంటే చాలా? మీ పిల్లలు బాగుంటే చాలా? మీ తల్లిదండ్రులు చల్లగా ఉంటే చాలా? మధ్యతరగతి వాళ్ళను బాగుండొద్దా? అంటూ శ్రీ రెడ్డి ప్రశ్నించారు. తన మనసు అర్థం చేసుకున్న వాళ్లంతా ముందుకొచ్చి సాయం చేయాలని కోరారు.. ఎన్నో కష్టాల్లో ఉన్నా కూడా నాకు తోచింది చేస్తున్నానని, నువ్వేం చేశావని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయొద్దని కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+