శ్రీహర్షితను చీట్ చేసి.. శ్రీకాంత్, గాయత్రీ పథకం,, అందుకే రేప్.. సంచలనం
గచ్చిబౌలి పీఎస్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న యువతిని రేప్ చేయించిన కేసులో అరెస్టైన గాయత్రి 2009లో ఇంట్లోంచి పారిపోయింది. తర్వాత తన క్లాస్ మేట్‌ను పెళ్లి చేసుకుంది. 2014లో భర్తపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టి అతని నుంచి దూరంగా ఉంటుంది. శ్రీకాంత్, గాయత్రి పథకం ప్రకారమే నాటకం ఆడినట్లు తెలుస్తోంది. బాధితురాలు శ్రీహర్షితకు చెందిన ఆస్తి కాజేయటానికి శ్రీకాంతే, గాయత్రీతో ఈ రేప్ వ్యవహారం నడిపించినట్టు సమాచారం.
శ్రీకాకులం నుంచి..
శ్రీకాంత్ స్వస్థం శ్రీకాకుళం. తల్లి తండ్రులు చిన్న పూరి గుడిసెలో ఉంటారు. రోడ్డుపై సెకండ్ హ్యాండ్ దుస్తులు విక్రయించి కాలం వెళ్లదీస్తున్నారు. బాధితురాలు శ్రీహర్షితతో శ్రీకాంత్‌కు శ్రీకాకుళంలో పరిచయం ఏర్పడింది. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. శ్రీ హర్షితతో తన పరిచయాన్ని గాయత్రికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 2020 జూన్‌లో గాయత్రితో తన తల్లిని ఇంట్లోనుంచి బయటకు గెంటించాడు. శ్రీకాంత్ అక్క అడగటానికి వస్తే గాయత్రితో ఆమెను కూడా కొట్టి బయటకు పంపించాడు. శ్రీ హర్షితను 2021లో శ్రీకాంత్ హైదరాబాద్ తీసుకు వచ్చాడు. 2021 అక్టోబర్‌లో గాయత్రి ద్వారా శ్రీహర్షితను తమ ఇంట్లోనే ఉండమని చెప్పించాడు. శ్రీహర్షిత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 2022 వరకు వారి ఇంట్లోనే ఉంది.

వివాహేతర సంబంధం..
శ్రీకాంత్, శ్రీ హర్షితల మధ్య సన్నిహిత సంబంధం ఉందని అనుమానించిన గాయత్రి.. ఏప్రిల్ నెలలో గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. కేసు విత్ డ్రా కోసం మే 26న శ్రీహర్షిత కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించింది. సాయంత్రం శ్రీహర్షిత తల్లితండ్రులను బయటే ఉండమని చెప్పిన గాయత్రి.. శ్రీహర్షితను లోపలికి తీసుకువెళ్లి నలుగురితో అత్యాచారం చేయించింది. శరీర భాగాలపై కొట్టటంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయ్యింది. ఆ దృశ్యాలను వీడియో తీయించి ఎవరికైనా చెపితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ హెచ్చరించింది. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. గాయత్రితో సహా మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో శ్రీకాంత్ ను కూడా అరెస్ట్ చేసి శిక్షించాలని బాదితురాలి తల్లి కోరుతోంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications