• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమ్మో దుర్మార్గులు.. బంగారం ధరకే రాళ్లు.. 'శ్రీకృష్ణ' లీలలు

|

హైదరాబాద్‌ : మోసాలకు లెక్క పత్రాలు ఉండవని అనుకున్నారు. అధికారుల కళ్లు గప్పి కోట్లు సంపాదిస్తున్నామని భావించారు. ప్రభుత్వాలకు మస్కా కొట్టి ఎంచక్కా డబ్బులు కూడబెడుతున్నామని అనుకున్నారు. కానీ, ఏదో ఓ రోజు బండారం బయటపడుతుందని మాత్రం ఊహించలేకపోయారు. ఇదంతా అక్షయ తృతీయ నాడు అధికారులకు అడ్డంగా దొరికిపోయిన శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ యజమానుల కథ. చివరకు చేసిన మోసాలు గుట్టురట్టు కావడంతో.. తమ సంస్థకు ఏ భగవంతుడి పేరు పెట్టుకున్నారో, ఆయన జన్మస్థలానికే పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

'శ్రీకృష్ణ' లీలలు

'శ్రీకృష్ణ' లీలలు

చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ వ్యాపారంలో జరిగింది అదే. హైదరాబాద్ కు చెందిన ఈ గ్రూప్.. అక్షయ తృతీయ సందర్భగా అధికారుల కంటికి చిక్కింది. దాంతో ఆ సంస్థ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విదేశాల నుంచి ముడి బంగారం దిగుమతి చేసుకుని.. వాటిని ఆభరణాలుగా మలచి ఎగుమతి చేయడం శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ ప్రధాన వ్యాపారం. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తతంగం వేరు.

నిబంధనలకు తూట్లు పొడిచి మరీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నారు శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ యజమానులు. విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుని.. ఆభరణాలు ఎగుమతి చేయాల్సింది పోయి అధిక లాభాల ఆశతో లోకల్ మార్కెటుకు తరలిస్తున్నారు. ఇక విదేశాలకు ఎగుమతి చేయాల్సిన ఆభరణాల స్థానంలో రాళ్లను పంపుతూ బంగారంగా చూపిస్తున్నారు. బంగారం ధరకు, రాళ్ల రేటుకు చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం. అయితే 'శ్రీకృష్ణ' లీలల గురించి పక్కా సమాచారం అందడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు దాడులు చేసి గుట్టురట్టు చేశారు.

చిల్లర పడేశారు.. లక్షలు దోచేశారు.. ఏటీఎం నగదు చోరీలో డైవర్షన్ (వీడియో)

1100 కిలోల బంగారం.. 330 కోట్ల మోసం

1100 కిలోల బంగారం.. 330 కోట్ల మోసం

ఒకటి కాదు రెండు కాదు 330 కోట్ల రూపాయల మేర మోసాలు చేసినట్లు గుర్తించారు అధికారులు. 1100 కిలోల బంగారాన్ని పక్కదారి పట్టించి.. ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌ సెజ్‌లో ఉన్నటువంటి శ్రీకృష్ణ జ్యువెల్లర్స్‌ యూనిట్‌ నుంచి ఈ తతంగం నడిపినట్లు వెల్లడైంది.

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి బంగారాన్ని ఆభరణాలుగా మలచి అంతే మొత్తంలో ఎగుమతి చేయాల్సి ఉంటుంది. కానీ రూల్స్ ను అతిక్రమించిన శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ ఎండీ ప్రదీప్ అతి తెలివి ప్రదర్శించారు. విదేశీ బంగారంతో తయారుచేయించిన ఆభరణాలను మన దేశంలోనే అమ్ముకుంటూ అధిక లాభాలు గడిస్తున్నారు. ఎంతైతే ముడి బంగారం దిగుమతి చేసుకున్నారో.. అంతే మొత్తంలో రాళ్లు పంపుతూ బంగారు ఆభరణాలు పంపినట్లు రశీదులు సృష్టించారు.

రశీదుల పరిశీలనతో వెలుగులోకి..!

రశీదుల పరిశీలనతో వెలుగులోకి..!

రెండు రోజుల కిందట రావిరాల సెజ్ లోని శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ యూనిట్ లో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. బంగారం దిగుమతి, ఎగుమతి రశీదులను పరిశీలించడంతో దొంగ లెక్కలు బయటపడ్డాయి. ఒక ఎగుమతికి సంబంధించిన రశీదులో 19 కిలోల బంగారం, 2 కేజీల రాళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే మొత్తం వెయిట్ 21 కిలోలు. కానీ వాస్తవానికి అందులో కేవలం 565 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. మిగతా బరువంతా రాళ్లున్నాయి. 21 కిలోల బంగారు ఆభరణాల విలువ 5 కోట్ల 65 లక్షలు కాగా.. 565 గ్రాముల బంగారంతో నింపిన రాళ్ల ధర కేవలం 22 లక్షల 16 వేలు మాత్రమే.

శ్రీకృష్ణ జన్మస్థానానికే..!

శ్రీకృష్ణ జన్మస్థానానికే..!

అక్షయ తృతీయ సందర్భగా బంగారం కొనుగోళ్లకు మాంఛి డిమాండ్ ఉండటంతో శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ వారు ఆభరణాలను పెద్దఎత్తున మార్కెటుకు పంపారు. ఆ క్రమంలోనే డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో భాగంగా 10 కేజీల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. అటు శ్రీకృష్ణ జ్యువెల్లర్స్ బంజారాహిల్స్‌ బ్రాంచిలో మోసం జరుగుతున్నట్లు తెలిసి అక్కడ కూడా సోదాలు నిర్వహించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 6.8 కేజీల బంగారు అభరణాలతో పాటు 491 కేజీల రాళ్లు, 21 కేజీల విదేశీ ముడి బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్‌ విలువ దాదాపు 14 కోట్ల 87 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇన్నాళ్లు అధికారుల కళ్లుగప్పి కోట్లకు కోట్లు సంపాదించిన శ్రీకృష్ణ జ్యువెల్లర్స్

ఎండీ ప్రదీప్‌తో పాటు మరో ముగ్గుర్ని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad based Srikrishna Jewellers MD and another three persons caught by DRI officials for cheating. They Imports raw gold from foreign countries and should export gold made ornaments for same countries. But, the srikrishna jewellers people not do like that, they will sale the ornaments in local markets. At last they were prisoned for cheating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more