వేసవి సెలవులపై విద్యార్థి ట్వీట్.. 12 వరకు స్కూళ్లు తెరిచేది లేదన్న కేటీఆర్
హైదరాబాద్ : ప్రభుత్వ పాత ఉత్తర్వుల ప్రకారం జూన్ 1వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండాకాలం వేడిగాలుల దృష్ట్యా.. వేసవి సెలవులను మరో పదిరోజులు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 11 వరకు సెలవులు కొనసాగించి.. 12వ తేదీన పాఠశాలలు తిరిగి తెరవాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసేందుకు సిద్ధమయ్యాయి. పాత ఉత్తర్వుల ప్రకారమే జూన్ 1వ తేదీన స్కూళ్లు రీఓపెన్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆ క్రమంలో ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.

ప్రభుత్వం వేసవి సెలవులు పొడిగించాలని ఉత్తర్వులు ఇస్తే.. తమ స్కూల్ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదనే విషయం కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చాడు సదరు విద్యార్థి. జూన్ 12వ తేదీకి బదులు 1వ తేదీనే పాఠశాలను ప్రారంభించేందుకు రెడీ అవుతోందని వివరించాడు.
I will request Hon'ble education minister and his team to issue clear instructions to all schools https://t.co/i9DnoimfMW
— KTR (@KTRTRS) May 28, 2019
జూన్ 1వ తేదీ నుంచి 12 వరకు ఒంటిపూట స్కూల్ నడిపేందుకు సిద్ధమయ్యారని.. ఆ మేరకు అందరికి మేసేజ్‌లు పంపించారని పేర్కొన్నాడు. ఎండ వేడికి బడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటూ ట్వీట్ చేశాడు. అయితే సదరు విద్యార్థి ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవుల పొడిగింపును అమలు చేసేలా చూడాలని విద్యాశాఖ మంత్రికి సూచించారు.












Click it and Unblock the Notifications