హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిద్రపోని భాగ్యనగరం: రాజా సింగ్ బ్యానర్లతో..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో అతిపెద్ద సామూహిక పండగగా గుర్తింపు పొందిన గణేష్ విగ్రహాల నిమజ్జన వేడుకకు హైదరాబాద్ సిద్ధమైంది. వేలాది విగ్రహాలు ఇవ్వాళ నిమజ్జనం కానున్నాయి. శనివారం తెల్లవారు జాము వరకూ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. దీనికోసం హైదరాబాద్ నగర పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

హైదరాబాద్‌లో పండగ..

హైదరాబాద్‌లో పండగ..

తొమ్మిది రోజుల పాటు కోట్లాదిమంది భక్తులతో పూజలు అందుకున్న వినాయకుడు.. ఇవ్వాళ హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాడు. పాతబస్తీలో సంప్రదాయంగా వచ్చే బాలాపూర్ లడ్డూ వేలంపాటతో నిమజ్జన వేడుకలు మొదలవుతాయి. హైదరాబాద్‌లో ఈ వేడుకల సందడి ఆరంభమైంది. పండగ వాతావరణం నెలకొంది. గణేషుడి విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించిన అయిదో రోజు నుంచే దశలవారీగా నిమజ్జనం కొనసాగుతూ వస్తోంది.

నిద్రపోని పాతబస్తీ..

నిద్రపోని పాతబస్తీ..

వినాయకుడి విగ్రహాల నిమజ్జనం అనగానే గుర్తుకొచ్చే హైదరాబాద్ పాతబస్తీలో రాత్రాంత శోభాయాత్ర సందడి కనిపించింది. గురువారం రాత్రి నుంచే భారీ ట్రాలీలు, ట్రాక్టర్లపై గణేషుడి విగ్రహాలను ట్యాంక్‌బండ్ వద్దకు తరలించడం మొదలు పెట్టారు భక్తులు. డీజే సౌండ్, డీజే సాంగ్స్-లైటింగ్‌తో పాతబస్తీ నిద్రపోలేదు. గంటల కొద్దీ భక్తులు రోడ్ల మీద డాన్సులు చేయడం కనిపించింది. డీజే సౌండ్స్‌కు అనుగుణంగా ట్రాలీలు, ట్రాక్టర్లపై స్టెప్పులు వేశారు. అన్ని గణేషుడి మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.

ట్రాఫిక్ మళ్లింపులు..

ట్రాఫిక్ మళ్లింపులు..

పాతబస్తీ నుంచి ట్యాంక్‌బండ్‌కు వెళ్లే అన్ని మార్గాలను సాధారణ ప్రయాణికుల రాకపోకల కోసం మూసివేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రాత్రి నుంచే వన్‌వేను అమల్లోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ మళ్లింపుల గురించి అధికారలు ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ఎక్కడెక్కడ వాహనాల మళ్లింపులు ఉంటాయనే విషయాన్ని వివరించారు. శాంతియుత వాతావరణంలో ఈ ప్రతిష్ఠాత్మక నిమజ్జనోత్సవాలను నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రాజా సింగ్ బ్యానర్లు..

రాజా సింగ్ బ్యానర్లు..

కాగా- పాతబస్తీలో పలు చోట్ల భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు రాజా సింగ్ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వాటిని కట్టారు. పాతబస్తీ నుంచి మొజాంజాహి మార్కెట్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు దారి తీసే అన్ని మార్గాల్లోనూ రాజా సింగ్ బ్యానర్లు కనిపించాయి. కొన్ని చోట్ల కటౌట్లు సైతం ఏర్పాటు చేశారు. ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గోషామహల్ నియోజకవర్గం పరిధిలో వీటి సంఖ్య మరింత ఎక్కువగా కనిపించింది.

మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్‌తో..

మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్‌తో..


మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజా సింగ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో తొలిసారిగా అరెస్టయిన అనంతరం ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ లభించిన మరుసటి రోజే మళ్లీ అరెస్ట్ అయ్యారు. ప్రీవెంటివ్ డిటెన్షన్ యాక్ట్‌ కింద రాజా సింగ్‌పై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన చర్లపల్లి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. బెయిల్ కోసం ఆయన భార్య ఉషా బాయి ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు.

English summary
Suspended BJP MLA Raja Singh banners and flexies flooded in the procession of Ganesh Idols.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X