హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశానికే తలమానికం టీ హబ్: సీఎం కేసీఆర్, స్టార్టప్ క్యాపిటల్‌గా హైదరాబాద్..

|
Google Oneindia TeluguNews

టీ హబ్-2కు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశానికి టీ హబ్ తలమానికంగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాక టీ హబ్ స్థాపనకు పెద్ద పీట వేశామన్నారు. హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్ నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. యువతలో ఎంతో శక్తి దాగి ఉందని చెప్పారు. యువ వ్యాపార వేత్తలను తయారు చేయడమే టీ హబ్ లక్ష్యం అని వివరించారు.

 స్టార్టప్ స్టేట్

స్టార్టప్ స్టేట్

2015 టి హబ్ 1 నెలకొల్పగా.. 2022 లో టీ హబ్ 2 స్థాపించామని చెప్పారు. దేశ భవష్యత్తుకు, యువతకు టీ హబ్ మార్గదర్శకంగా ఉండబోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో తెలంగాణ స్టార్ట్ అప్ ఆఫ్ స్టేట్‌గా తయారు అవుతుందన్నారు.

 ఓకే గొడుగు కిందకు..

ఓకే గొడుగు కిందకు..


హైదరాబాద్ స్టార్టప్ హబ్‌గా మారుతుంది. స్టార్టప్‌లు అన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయి. దేశంలో ప్రతిష్టాత్మక స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ హబ్‌ 2.0 ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రెండో టీ హబ్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన టీ హబ్‌ 2.0కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 4,000లకు పైగా స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేసే అవకాశం ఉంది.

2 వేల స్టార్టప్‌లు

2 వేల స్టార్టప్‌లు


స్టార్టప్స్‌, ఎంట్రప్రెన్యూర్స్‌, ఇన్నోవేటర్స్‌, వెంచర్‌ క్యాపటిలిస్ట్స్‌, మెంటార్స్‌ కార్యకలాపాలకు వేదిక అయ్యేలా టీ హబ్‌ను నిర్మించారు. అత్యున్నత ప్రమాణాలతో 276 కోట్ల రూపాయలతో నిర్మించిన టీ హబ్‌ 2 దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్‌గా నిలిచింది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టి హబ్‌ 2ని నిర్మించారు. రెండు వేల స్టార్టప్‌లు పనిచేసుకునేలా ఫెసిలిటీస్‌ కల్పించారు.

2015లో తొలి టీ హబ్

2015లో తొలి టీ హబ్


తొలి టీ హబ్‌ను 2015లో ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో ప్రారంభించారు. పెద్ద టీ హబ్‌ అవసరమని ప్రభుత్వం భావించింది. ప్రతిష్టాత్మకమైన టీ హబ్‌ 2.0కు ప్లాన్‌ చేసింది. మొదటి టీ హబ్‌ కంటే రెండోది ఐదు రెట్లు పెద్దది. కొరియా కంపెనీ స్పేసెస్‌ టీ హబ్‌ 2.0 డిజైన్‌ను చేసింది. స్పేస్‌ షిప్‌ స్ఫూర్తితో డిజైన్‌ చేసిన ఈ బిల్డింగ్‌ను 10 అంతస్తులతో నిర్మించారు.

English summary
t-hub is precious to our country cm kcr said. today t-hub-2 launched.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X