తహసీల్దార్ హత్య కేసు నిందితుడు సురేష్ మృతి: చికిత్స పొందుతూనే.:. వాంగ్మూలం లో ఇలా..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్ మృతి చెందాడు. నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి పెట్రోల్ పోసి తహసీల్దార్ విజయా రెడ్డిని హత్య చేసారు. అదే ఘటనలో సురేష్ 65 శాతానికి పైగా గాయాలయ్యాయి. నాలుగు రోజుల నుండి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించటంతో వెంటిటేడర్ పైన చికిత్స అందించారు. అయితే, కొద్ది సేపటి క్రితం మరణించాడు. తన స్థలానికి సంబంధించి పట్టా పుస్తకం కోసం తాను ఎన్ని సార్లు తిరిగినా తహసీల్దార్ పట్టించుకోకపోవటంతోనే తాను విజయా రెడ్డి పైన పెట్రోల్ పోసానని సురేష్ తన మరణ వాంగ్మూలంలో స్పష్టం చేసారు. ఇప్పటికే ఘటనా స్థలిలో తహసీల్దార్ విజయా రెడ్డి..ఆ తరువాత డ్రైవర్ గురునాధం..ఇప్పుడు నిందితుడు సురేష్ మరణించారు. తహసీల్దార్ అటెండర్ సైతం కాలిన గాయాలతో చికిత్సొ పొందుతున్నారు.
తహసీల్దార్ హత్యకేసులో ట్విస్ట్ ... విజయారెడ్డి హత్య కు సురేష్ రెక్కీ , హత్య వెనకాల వారి హస్తం ?
నిందితుడు సురేష్ మరణం..
మూడు రోజులుగా చావు బతుకులతో కొట్టు మిట్టాడుతున్న సురేష్ కన్నుమూసాడు. ఎమ్మార్వో విజయారెడ్డి పైన పెట్రోల్ పోసి ఇప్పటికే ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. తనకు చెందిన భూములకు సంబంధించి పట్టా కోసం తాను ఎన్ని సార్లు తహసీల్దార్ విజయారెడ్డి చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని సురేష్ తన వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది. తన పట్టా తనకు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టిందని చెప్పుకొచ్చారు. అదే సమయంతో తానున తహసీల్దార్ పైన పెట్రోల్ పోయటంతో పాటుగా తాను పోసుకొని ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేసానని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంలో వందల ఎకరాల భూములు వివాదాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ భూముల పైన 1990 నుంచి వివాదాలున్నట్లు చెబుతున్నారు. 2004 తర్వాత భూములపై కొందరు రాజకీయ నేతల కళ్లు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వివాదా స్పదమైన భూముల వ్యవహారంలో తల దూర్చిన కొందరు పెద్దలు.. మరోవైపు భూములు కొన్న పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు చేసినట్లు తెలుస్తోంది.

రాజకీయంగానూ ప్రకంపణలు..
తహసీల్దార్ పైన పెట్రోల్ పోసిన తరువాత కాలిన గాయాలతో సురేష్ బయటకు వచ్చిన రోడ్డు పైన వెళ్తూ కారులో మాట్లాడిన విజువల్స్ పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్నది ఎవరు..ఈ సురేష్ వెనుక ఎవరైనా ఉండి ఈ దారుణం చేయించారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మల్ రెడ్డి రంగారెడ్డి..మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య రాజకీయంగా వాగ్వాదాలు జరుగుతు న్నాయి. ప్రభుత్వం సైతం ఈ మొత్తం వ్యవహారం పైన సీరియస్ గా ఉన్నది. సురేష్ అధికార పార్టీ కార్యకర్త అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే..సురేష్ కు ఎటువంటి సభ్యత్వం లేదని అధికార పార్టీ నేతలు చెబతున్నారు. ఇక, అసలు నిందితుడు సురేష్ మరణంచటంతో ఇప్పుడు ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతున్నది అనేది ఆసక్ది కంగా మారింది.