హైదరాబాద్ పబ్‌లలో అశ్లీల నృత్యాల గబ్బు; టాస్క్ ఫోర్స్ దాడులలో మరో పబ్ బాగోతం!!
భాగ్యనగరంలో పబ్ ల నిర్వహణపై పోలీసులు ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చినా, పబ్ ల నిర్వాహకులు గబ్బు పనులు మానడం లేదు. ఎక్కడ చూసినా పబ్ లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మద్యం, డ్రగ్స్, వ్యభిచారం ప్రధానంగా పబ్ ల కేంద్రంగా సాగుతుంది. పోలీసులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా పబ్ ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.ఇక అలాంటి పబ్ లపై ఉక్కుపాదం మోపుతున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

టకీలా పబ్ ఘటన మరచిపోకముందే మరో ఘటన
మొన్నటికి మొన్న రాంగోపాల్ పేట లో టకీలా పబ్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిని అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇక ఆ ఘటన మరచిపోక ముందే మళ్లీ తాజాగా సికింద్రాబాద్ లోని మరో పబ్ లో అశ్లీల నృత్యాల ఘటన వెలుగులోకి వచ్చింది. మరో పబ్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు చేసిన దాడులలో పలువురిని అరెస్ట్ చేశారు.

స్వింగర్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. అశ్లీల నృత్యాలు చేస్తున్న వారి అరెస్ట్
సికింద్రాబాద్‌లోని హోటల్ బసేరాలోని అవుట్ స్వింగర్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి అసభ్యకర డాన్సులను చేస్తున్న తొమ్మిది మంది మహిళలు మరియు నలుగురు కస్టమర్‌లను పట్టుకున్నారు. పబ్ ఆపరేటర్, జనరల్ మేనేజర్, కార్మికులు సహా ఎనిమిది మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అవుట్ స్వింగర్ పబ్‌లో కొంతమంది మహిళలు కస్టమర్లతో అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నిర్దిష్ట సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు డికాయ్ ఆపరేషన్ చేపట్టారు.

మహిళలు, పురుషులను రెచ్చగొడుతూ అశ్లీల నృత్యాలు
కొందరు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ సహా డెకాయ్ టీమ్ కొందరు కస్టమర్లతో కలిసి మహిళలు చేస్తున్న అసభ్యకర చర్యలను సెల్‌ఫోన్‌లలో బంధించారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇరవై మరియు ముప్పై ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలు గంటకు 1,000 రూపాయలు, భోజనం, మద్యం ఖర్చు కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉంటే వారిని ఎంటర్టైన్ చేస్తామంటూ పబ్ కు వచ్చినవారికి ఎర వేస్తారు. ఆపై వారిని రెచ్చగొడుతూ అశ్లీల నృత్యాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టాస్క్ ఫోర్స్ అధికారి తెలిపారు.

పబ్ నిర్వాహకులు అరెస్ట్ .. యజమాని పరారీ
ప్రాథమిక సాక్ష్యాలను సేకరించిన తర్వాత, టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్‌పై దాడి చేసి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడినందుకు తొమ్మిది మంది మహిళలు మరియు నలుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. వారందరిని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిపై సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. ఆపరేటర్ అమర్ ఓహ్రీ, జనరల్ మేనేజర్ షరీఫ్ , డీజే ఆపరేటర్ మరియు సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌లతో సహా పబ్ నిర్వహణతో సంబంధం ఉన్న ఎనిమిది మంది వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ పబ్ యజమాని అమర్ ఓరీ పరారీలో ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications