తెలంగాణలో ఫస్ట్‌టైమ్: ఒక్కరోజే అరలక్షకు పైగా: వన్ మిలియన్‌: కొత్త కేసుల్లోనూ అనూహ్య వేగం

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం సరి కొత్త రికార్డును సృష్టించింది. తొలిసారిగా తెలంగాణలో 50 వేలకు పైగా కరోనా శాంపిళ్ల పరీక్షలు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన పరీక్షల్లో ఇదే అత్యధికం. 24 గంటల వ్యవధిలో 52,933 కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు అధికారులు. టెస్టింగులకు అనుగుణంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లోనూ పెరుగుదల కనిపించింది. కొత్తగా రికార్డు స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గలేదనే విషయాన్ని స్పష్టం చేశాయి.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా తెలంగాణలో కొత్తగా 2579 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు. 1752 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,08,670కి చేరుకుంది. ఇందులో 84,163 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 770కి చేరుకుంది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 23,737గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 17,226 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana: 2579 Covid19 positive cases and 6 deaths were reported in Telangana last 24 hours

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. 24 గంటల్లో కొత్తగా 295 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. ఇదివరకు నమోదైన వాటితో పోల్చుకుంటే.. ఈ సంఖ్య తక్కువే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. జిల్లాల్లో భారీగా పెరిగాయి. జీహెచ్ఎంసీకి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీగా నమోదు అయ్యాయి. కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు నమదైనట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు.

24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-34, భద్రాద్రి కొత్తగూడెం-83, జగిత్యాల-98, జనగామ-46, జయశంకర్ భూపాలపల్లి-12, జోగుళాంబ గద్వాల-47, కామారెడ్డి-64, కరీంనగర్-116, ఖమ్మం-161, కొమరంభీమ్ ఆసిఫాబాద్-10, మహబూబ్ నగర్-69, మహబూబాబాద్-81, మంచిర్యాల-104, మెదక్-42, మేడ్చల్ మల్కాజ్‌గిరి-106, ములుగు-16, నాగర్ కర్నూలు-48, నల్లగొండ-129, నారాయణపేట్-19, నిర్మల్-28, నిజామాబాద్-142, పెద్దపల్లి-85, రాజన్న సిరిసిల్ల-59, రంగారెడ్డి-186, సంగారెడ్డి-30, సిద్ధిపేట్-92, సూర్యాపేట్-78, వికారాబాాద్-23, వనపర్తి-56, వరంగల్ రూరల్-31, వరంగల్ అర్బన్-143, యాదాద్రి భువనగిరి-46 కేసులు నమోదు అయ్యాయి.

24 గంటల వ్యవధిలో మొత్తం 52,933 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 10,21,054కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 27,502 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాలు 1076 ఉన్నాయి. వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది.

Recommended Video

    RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+