తెలంగాణ అసెంబ్లీ, మండలి నిరవధిక వాయిదా, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. బ‌డ్జెట్ స‌మావేశాలు మంగ‌ళ‌వారంతో ముగిశాయి. ఈ మేర‌కు శాస‌న స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ామని స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఆఖరి రోజు సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసాయి. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శాసన సభ 54 గంటల 55 నిమిషాలు సాగిందని, మండలి 12 గంటలు సాగిందని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ కొన్ని ముఖ్య ప్రకటనలు వచ్చాయని, తక్కువ రోజులు ఎక్కువ సమయం సమావేశాలు సాగాయన్నారు. ప్రజాధనం వృథా కావడం కేసీఆర్ ఇష్టం ఉండదని, స‌మావేశాల‌ను తక్కువ‌ రోజులే జరిపినా ఎక్కవ సమయం నడిపామన్నారు.

today telangana assembly and mandali indefinite adjournment.

మినిమం 8 గంటలు, ఒక్కోరోజు 12 గంటలు కూడా స‌భ‌ సాగిందని ప్ర‌శాంత్ రెడ్డి వెల్ల‌డించారు. భట్టి విక్రమార్క ప్రతి పక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడాలి అని మాట్లాడుతున్నారని.. వాళ్లకు ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది 6 మంది.. కానీ ఇద్దరు ముగ్గురే ఉన్నారన్నారు. విప‌క్షాలు అడిగిన‌ అన్నింటికీ సమాధానాలు ఇచ్చామని, సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్‌లకు అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు.

తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. 4 రోజుల 12 గంటల పాటు సమావేశాలు జరిగాయి. ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. నాలుగు బిల్లులను తెలంగాణ శాసనమండలి ఆమోదించింది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+