హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో తెలంగాణ అసెంబ్లీ సెషన్.. 4 రోజులు నిర్వహణ.. ఇందుకోసమే..

|
Google Oneindia TeluguNews

త్వరలో అసెంబ్లీ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. దళిత బంధు పథకానికి చట్టబద్ధత కల్పించడానికి సెషన్ నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో మూడు లేదా నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని ప్రవేశపెట్టారనే విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. దళితుల అభివృద్ధి కోసమే పథకం ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దళిత సాధికారత కోసం గత బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం- దళిత బంధు పథకం అమలు చేసి ఆ నిధులను భారీగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సెషన్..

అసెంబ్లీ సెషన్..


ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ నెలలో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16న పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, పథకానికి చట్టబద్ధత తీసుకుని రావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే వారంలో నాలుగైదు రోజుల పాటు ఉభయ సభల సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దళిత బందుకు అసెంబ్లీ, మండలి ఆమోదం తెలిపి చట్టబద్ధత కల్పించినట్లయితే దళితులకు భవిష్యత్తులో కూడా పథకం ఫలాలు అందే అవకాశం ఉంటుంది. దళితుల్లో మరింత భరోసా కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత కార్మికుల కోసం చేనేత భీమా పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. అసెంబ్లీ వేదికగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఇక్కడ అమలు..

ఇక్కడ అమలు..

తెలంగాణలో దళిత బంధు అమలయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి ఈ పథకం ప్రారంభించారు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వాసాలమర్రిలో అర్హులైన 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదల చేశారు. నిన్న వాసాలమర్రి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో ఇవాళ ఆ నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకానుంది.

ఫైలట్ ప్రాజెక్టు..

ఫైలట్ ప్రాజెక్టు..

​పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింప చేస్తారు.

హుజురాబాద్‌‌లో పైలట్ ప్రాజెక్ట్

హుజురాబాద్‌‌లో పైలట్ ప్రాజెక్ట్


సీఎం కేసీఆర్ ఇదివరకు అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన 'సింహ గర్జన' సభ ఇక్కడే నిర్వహించారు. 'రైతు బీమా' పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన 'రైతుబంధు' పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని, సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. దత్తత గ్రామం వాసాలమర్రికి నిధులను విడుదల చేసి.. లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో సింహాభాగం మాత్రం.. హుజురాబాద్ నియోజకవర్గానికి దక్క అవకాశం ఉంది.

ఇవే కీలక అంశాలు

ఇవే కీలక అంశాలు

దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలుంటాయి. పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది.

రక్షక కవచం..

రక్షక కవచం..

దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తొవది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుచేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు.

1200 కోట్లు

1200 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందన్నారు. అందుకోసం అధనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఖర్చు చేయనున్నట్టు సీఎం తెలిపారు.

English summary
telangana assembly session start soon. 3 to 4 days conduct session for legality to dalita bandhu scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X