హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చి 7వ తేదీన తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు ప్రయారిటీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 7వ తేదీ ఉద‌యం 11:30 గంట‌ల‌కు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదే రోజు రాష్ట్ర బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెడతారు. రాష్ట్ర బ‌డ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6న సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రివ‌ర్గం స‌మావేశం అవనుంది. స‌భ ఎన్ని రోజులు జ‌ర‌గాలి అనే విష‌యంపై బీఏసీ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకుంటారు.

బ‌డ్జెట్ స‌మావేశాల‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. సుదీర్ఘంగా చ‌ర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. స‌మావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సభ ప్రారంభం కానుంది.

telangana budget session start from march 7th

ఎప్పటిలాగే ఈ సారి కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. రైతుబంధు పథకం కంటిన్యూ.. అందుకు నిధులు. రైతు భీమాకు నిధులు, పెన్షన్, దళితబంధు పథకం విస్తరణ తదితర సంక్షేమ పథకాలకు కేసీఆర్ సర్కార్ ప్రయారిటీ ఇవ్వనుంది. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కూడా అన్నీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తారు. ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. నిరుద్యోగుల కోసం కొలువులపై అసంతృప్తి ఉన్న.. అరకొర పోస్టులతో నెట్టుకు వస్తున్నారు. డీఎస్పీ వేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

English summary
telangana budget session start from march 7th. finance minister harish rao will introduce
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X