3 రోజులు విలీన దినోత్సవ వజ్రోత్సవాలు: కేబినెట్ ఆమోదం
తెలంగాణ విలీన దినోత్సవ వజ్రోత్సవాలు మూడు రోజులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సెప్టెంబర్17 నాటికి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో విలనమై 75 ఏళ్లు అవుతుంది. సెప్టెంబర్ 17 ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం' గా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల' ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
అలాగే శాసనసభ సమావేశాల గురించి కూడా ప్రస్తావనకు వచ్చిందంట. శాసనసభ సమావేశాల గురించి మంత్రివర్గ సమావేశం చర్చ జరిపింది. పోడు భూముల అంశం, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, విద్యుత్ బకాయిలు సహా వివిధ అంశాల్లో కేంద్ర వైఖరి గురించి కూడా సమావేశంలో చర్చించారు. సీబీఐకి రాష్ట్రంలో అనుమతి నిరాకరణ వంటి పలు అంశాలపై చర్చకు వచ్చింది. మున్సిపల్ యాక్ట్, పరిశ్రమల యాక్ట్, అటవీ యాక్ట్, విద్యాశాఖ యాక్ట్ సవరణపై కేబినెట్‌లో చర్చ జరిగింది.

ఈ నెల ఆరో తేదీ నుంచి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనే విషయమై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై కూడా చర్చించారు.












Click it and Unblock the Notifications