ఎల్లుండి బీహర్‌కు సీఎం కేసీఆర్.. నితీశ్‌తో భేటీ..

ఇటీవల సీఎం కేసీఆర్ కూడా బిజీగా ఉంటున్నారు. సమయం దొరికితే చాలు.. జాతీయ రాజకీయాలు, విపక్షాలను ఎండగడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ.. సీఎంలు/ ప్రాంతీయ పార్టీ అధినేతలను కలుస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీయే వ్యతిరేక పక్షాలను కూడగట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు.

జాతీయ రాజకీయాల కార్యాచరణలో భాగంగా ఈ నెల 31వ తేదీన బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో సమావేశం కానున్నారు. పాట్నాలో నితీశ్ కుమార్‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో నేషనల్ పాలిటిక్స్ గురించి చర్చిస్తారు. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ కలుస్తారు.

telangana cm kcr goes to bihar on wednesday

అమర జవాన్లకు గతంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో ఆర్థికసాయం ప్రకటంచిన సంగతి తెలిసిందే. ఆ సాయాన్ని ఈ పర్యటనలో భాగంగా అందిస్తారు. దీంతోపాటు సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగింది. 12 మంది బీహార్ వలస కూలీలు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+