చంద్రబాబు, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గత 30 సంవత్సరాల్లో చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్ర అగ్నిమాపక విభాగానికి సంబంధించిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. వేలసంఖ్యలో నిర్మాణాలకు అనుమతులిచ్చే అగ్నిమాపక విభాగానికి సొంత భవనం లేకపోవడం మంచిదికాదన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్న నగరమే అభివృద్ధి చెందుతుందన్నారు.
రాజకీయాలు కు అతీతంగా పై ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని, హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను చంద్రబాబు ప్రతిపాదించారని రేవంత్ తెలిపారు. వైఎస్సార్ దాన్ని కొనసాగించారని, త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డును తీసుకొస్తామని, ఈ రోడ్ చుట్టూ రైలు సదుపాయం కూడా రాబోతోందన్నారు.

హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా ప్రణాళిక రూపొందించామని, అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ఫార్మా సిటీ మంచిది కాదని, ప్రమాదకరమైన డ్రగ్ తయారీ కంపెనీని 10 నుంచి 15 పల్లెటూళ్లలో ప్లాన్ చేస్తున్నామని రేవంత్ తెలిపారు. 25వేల ఎకరాల్లో ఫార్మా తీసుకొస్తే హైదరాబాద్ కలుషితమవుతుందని, రాజకీయంగా తనకు అవగాహన ఉందని, నిర్మాణ సంస్థలతో చర్చిస్తామన్నారు. అప్పటివరకు తాము అపర మేధావులమని ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోవడంలేదన్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది కూడా మేడిగడ్డ అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు కూడా కొంత సమయం కావాలని, అవగాహన లేకుండా అనుమతులిస్తూ సంతకాలు పెడితే HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితే వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications