బ్లాక్ ఫంగస్ మహమ్మారీ, తెలంగాణ ప్రకటన.. తమిళనాడు, ఒడిశా, అసోం కూడా..

కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతోన్న బ్లాక్ ఫంగస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోజుల తరబడి పోరాడి ఎట్టకేలకు కొవిడ్ నెగెటివ్ తో గెలిచామని చెప్పుకునే లోపే బ్లాక్ ఫంగస్ ప్రాణాలను హరించేస్తుంది. దీనిపై కేంద్రం.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. వాటిల్లో భాగంగానే తెలంగాణ, తమిళనాడు, అస్సాం, ఒడిస్సా రాష్ట్రాలు బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా ప్రకటించాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పినట్లుగా బ్లాక్ ఫంగస్ పట్ల అన్ని గైడ్ లైన్స్ పాటించాలని చెప్పింది.

అంటువ్యాధి అని..

అంటువ్యాధి అని..


బ్లాక్‌ ఫంగస్‌ను అంటు వ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు లేఖ రాస్తూ పలు సూచనలు చేసింది. ఇటువంటి కేసులను గుర్తించిన వెంటనే ఆరోగ్య శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లను ఆదేశించాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలెన్స్ ప్రాజెక్ట్ సిస్టమ్‌లో ఎంటర్ చేయాలని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువగా ఉన్నది భారత్‌లోనే అని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్‌ ఫంగస్‌ హడలెత్తిస్తోంది. దీనికి సరైన మెడిసిన్‌ అందుబాటులో లేకపోవడంతో వ్యాధి సోకిన వారు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

చికిత్స ఇలా

చికిత్స ఇలా

బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌కు బహుళ విధాల చికిత్స అవసరమవుతుందని, కంటి సర్జన్లు, ఈఎన్‌టీ స్పెషలిస్టులు, జనరల్ సర్జన్, న్యూరో సర్జన్, డెంటల్ సర్జన్ల సేవలు అవసరమవుతాయని పేర్కొంది. యాంటీఫంగల్ మెడిసిన్ ఎంఫోటెరిసిన్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపింది. ఎపిడెమిక్ చట్టం ద్వారా వ్యాధిని కట్టడి చేయడానికి అధికారులకు ప్రత్యేకాధికారాలు సంక్రమిస్తాయి. బ్లాక్ ఫంగస్ నియంత్రణకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ రూపొందించిన మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

Recommended Video

    Long COVID ఓసారి తగ్గాక మళ్లీ ?| 6-12 Months After First Infection మళ్లీ వైరస్ దాడి| Oneindia Telugu
    ఇలా వస్తోంది..

    ఇలా వస్తోంది..

    స్టెరాయిడ్స్ వాడిన వారు, షుగర్ కంట్రోల్ తప్పిన కరోనా పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు నిపుణులు తెలుపుతున్నారు. మహారాష్ట్రలో 1500 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వగా 90 మంది మరణించారు. రాజస్తాన్‌లోనూ వందకుపైగా కేసులున్నాయి. కేంద్రం ఆదేశాలకు ముందే బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా రాజస్తాన్ ప్రకటించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+