హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపిస్ట్ రాజు మృతిపై అనుమానాలు,రాద్దాంతం వద్దు : డీజీపీ ; మావోయిస్ట్ అగ్ర నేత భార్య లొంగుబాటు..

|
Google Oneindia TeluguNews

రేపిస్ట్ పల్లంకొండ రాజు ఆత్మహత్యపై అనుమానాలు వద్దని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.అతని ఆత్మహత్యపై అనవసర రాద్దాంతాలు చేయవద్దన్నారు.ఎవరి వద్దనైనా ఆధారాలుంటే మాట్లాడాలని... అంతే తప్ప తప్పుదోవ పట్టించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరారు. రాజు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఏడుగురు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు.ప్రత్యక్ష సాక్షుల్లో ఇద్దరు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు,ఇద్దరు రైల్వే గ్యాంగ్ మెన్లు,ముగ్గురు రైతులు ఉన్నట్లు చెప్పారు.సాక్షులు ఇచ్చిన సమాచారాన్ని వీడియో రికార్డ్ చేశామన్నారు.

దండకారణ్యంలో కరోనా-మరో మావోయిస్టు నేత శారద మృతి-భర్త హరిభూషణ్ మృతి చెందిన 3 రోజులకేదండకారణ్యంలో కరోనా-మరో మావోయిస్టు నేత శారద మృతి-భర్త హరిభూషణ్ మృతి చెందిన 3 రోజులకే

లొంగిపోయిన మావోయిస్టు శారదక్క :

లొంగిపోయిన మావోయిస్టు శారదక్క :

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేత శారదక్క అలియాస్ జజ్జరి సమ్మక్క (45) లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.కరోనా బారినపడ్డ మావోయిస్టులకు సరైన చికిత్స అందడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య కారణాలతో చాలామంది పార్టీని వదిలి బయటకు వస్తున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో తన భర్త హరిభూషణ్‌కి సరైన చికిత్స అందించలేదని మావోయిస్టు పార్టీపై శారదక్క ఆగ్రహంగా ఉందన్నారు. ఆమెకు ఆర్థిక సాయం కింద రూ.5లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ ప్రజల నుంచి మావోయిస్టులకు ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రక్షణ కల్పిస్తామన్నారు.

25ఏళ్లు మావోయిస్టు పార్టీలో


శారదక్క ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారని... 1997-98 మధ్యలో శారద కిన్నెర దళంలో పనిచేసిందని డీజీపీ తెలిపారు.1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ సభ్యురాలిగా శారదక్క పనిచేసిందన్నారు.2008లో వరంగల్ ఎస్పీ ముందు శారదక్క లొంగిపోయిందని.. కానీ 2011లో ఆమె తిరిగి పార్టీలో చేరిందని తెలిపారు.2016లో చర్ల ఏరియా కమిటీకి ఆమె ప్రమోట్ అయిందన్నారు. శారదపై 25 కేసులున్నాయని... గతంలో ఆరు దఫాలు ఎదురుకాల్పుల ఘటనల్లో ఆమె తప్పించుకొందని డీజీపీ చెప్పారు.25 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన శారదక్క మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పోలీసుల ద్వారా విజ్ఞప్తి చేశారు.

శారదక్క నేపథ్యం

శారదక్క నేపథ్యం

శారదక్క స్వస్థలం మహబూబాద్‌ జిల్లాలోని గంగారం. పీపుల్స్‌వార్‌ పార్టీ పట్ల ఆకర్షితురాలైన ఆమె 1994లో అడవి బాట పట్టారు. 1995లో పార్టీ అనుమతితో శారదక్కను హరిభూషణ్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. శారదక్క భర్త, మావోయిస్టు అగ్ర నేత హరిభూషణ్.. ఈ ఏడాది జూన్‌ 21 కరోనాతో చనిపోయిన సంగతి తెలిసిందే. బస్తర్ అడవుల్లో మావోయిస్టులు కరోనా బారినపడ్డారని గతంలో వార్తలు రాగా మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ దాన్ని ఖండిచింది. ఆ మేరకు సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట ప్రకటన విడుదలైంది. ఒకవేళ పార్టీలో ఎవరైనా కరోనా బారినపడితే వెల్లడిస్తామని అందులో పేర్కొన్నారు. ఇంతలోనే హరిభూషణ్ కరోనాతో మృతి చెందారు.దీంతో దళంలో చాలామంది కరోనా బారినపడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హరిభూషణ్ మృతికి నెల క్రితం మావోయిస్టు నేత గడ్డం మధుకర్ కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వరంగల్‌లో అరెస్టు తర్వాత ఆయన కరోనా బారినపడ్డ ఆయన... ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మధుకర్ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన మధుకర్ 1999లో నక్సలైట్ ఉద్యమంలో చేరారు.

English summary
Telangana DGP Mahender Reddy clearly sai that rapist Raju committed suicide and no doubts in it.He added,there were seven witnessed while raju committing suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X