పది ఫలితాలపై కసరత్తు.. రేపో, మాపో విడుదల..
కరోనా వల్ల పిల్లల ఎడ్యుకేషన్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరసగా రెండో ఏడాది కూడా ప్రమోట్ చేశారు. 8,9 తరగతుల వరకు అయితే ఓకే.. 10, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ఇదే సిచుయేషన్. దీంతో తెలంగాణలో ఫలితాల విడుదలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెన్త్ పరీక్షలను ఇప్పటికే రద్దుచేసిన సంగతి తెలిసిందే.
పదో తరగతి ఫలితాల వెల్లడికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. పరీక్షల అనంతర ప్రక్రియలకు ప్రభుత్వ పరీక్షల విభాగం శ్రీకారం చుట్టింది. ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మార్కుల అప్ లోడింగ్, గ్రేడింగ్ ప్రక్రియ జరుగుతోంది. మార్కులు అప్ లోడ్ పూర్తికాగానే ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది.

పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు అందరూ పాస్ అని వెల్లడించింది. గతేడాది కూడా ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే ఫలితాలు వెల్లడించారు. ఈ సారి కూడా అదే విధానంలో పాస్ చేస్తున్నారు. కానీ దీంతో ప్రతిభ గల విద్యార్థులకు మాత్రం నష్టం కలుగుతోంది. వారి మార్కుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అత్తెసరు మార్కులతో పాసయే వారికి మాత్రం మేలు జరుగుతుంది.












Click it and Unblock the Notifications