ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి.. సాగర్‌లో నిమజ్జనంపై టీ సర్కార్, హైకోర్టులో పిటిషన్
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతించొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని ఆదివారం తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జానికి ఈ సారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా అనుమతివ్వాలని కోరింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసిన 48 గంటల్లోనే క్లీన్ చేస్తున్నామని.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈసారికి అనుమతివ్వాలని కోరింది.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్..
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. హుస్సేస్ సాగర్ లో అన్ని విగ్రహాల నిమజ్జానికి అనుమతివ్వాలని కోరింది. ఇప్పటికిప్పుడు బేబీపాండ్స్ ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.వినాయక నిమజ్జనంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి నిరాకరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని హైకోర్టు తెలిపింది.

రబ్బర్ డ్యాం...
హుస్సేన్‌సాగర్‌లో రబ్బరు డ్యాంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. దూరప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఒకే రోజు కాకుండా ప్రణాళిక ప్రకారం అనుమతించాలని పోలీసులకు సూచించింది. చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేయాలనీ ప్రజలకు సూచించింది. నిమజ్జన ప్రాంతాల్లో కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు పంపిణి చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని తెలిపింది.వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా మండపాల ఏర్పాటు చేయాలని సూచించింది. రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించింది. మండపాల దగ్గర ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని తెలిపింది. ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని తెలిపింది. రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని వెల్లడించింది. వినాయక మండపాల వద్ద శానిటైజర్లు ఉంచాలని తెలిపింది.

ఇదివరకు కూడా.. కానీ
వినాయక చవితి సందర్భంగా 9 రోజులు ఆ గణనాథుడిని పూజిస్తుంటాం. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం రంగుల గణేశ ప్రతిమలను వాడొద్దను పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. అలాగే తక్కువ ఎత్తు గల విగ్రహాలను పూజించాలని కోరారు. కానీ కొందరు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఎప్పటిలాగే పెద్ద పెద్ద.. రంగు రంగుల విగ్రహాలను వాడుతున్నారు. దీనిపై కొందరు పర్యావరణ వేత్తలు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ మేరకు ధర్మాసనం స్పందించింది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలా కోర్టు తీర్పు చెప్పింది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరడంతో.. ఎక్స్ డెంట్ చేస్తూ వస్తోంది. ఈ సారి కూడా తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కోరింది. ఈ మేరకు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications