హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు ఆదేశాలు గౌరవిస్తాం.. బూస్టర్ డోసుపై కేంద్రం తేల్చలే: మంత్రి హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా బయట పడుతున్నాయి. రోజు రోజుకు కేసులు వస్తున్నాయి. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి కూడా పాజిటివ్ రావడం.. ఓ వైద్యుడికి కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు.

 కచ్చితంగా..

కచ్చితంగా..

రాష్ట్రంలో ఒమిక్రాన్ కట్టడి కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. బూస్టర్ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై స్పందించడం కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. ఇతర దేశాలు బూస్టర్ డోస్ ఇవ్వాలని చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. బూస్టర్ ఇస్తే ఇమ్యూనిటీ మరింత మెరగవుతుందని వివరించారు.

హైకోర్టు విచారణ

హైకోర్టు విచారణ


అంతకుముందు తెలంగాణలో కొవిడ్ ప్రభావంపై హైకోర్టులవిచారణ జరిగింది. ఒమిక్రాన్ వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎయిర్ పోర్టులో ఉన్న విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి తగిన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని సూచించింది. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఏ విధంగా నిబంధనలు విధించారో అదేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

 నాణ్యమైన వైద్యం

నాణ్యమైన వైద్యం

ఇటు రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఐసీయూ భవనం, నూతన ఆపరేషన్ థియేటర్స్‌ని హరీష్ రావు ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ వారి సహకారంతో వీటిని నిర్మించారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువ అన్నారు. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారన్నారు. ఆమె ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకొని పోవాలని పిలుపునిచ్చారు.

 వేగంగా నిధులు

వేగంగా నిధులు

ఆరోగ్య శ్రీ నిధుల విడుదలలో ఆలస్యం లేకుండా చర్యలు తీకుంటున్నామన్నారు. ఇంకా తొందరగా విడుదల అయ్యేటట్టు చూస్తున్నామన్నారు. 6 నెలల క్రితం ఆక్సిజన్ దొరుకక ఇబ్బంది కలిగినప్పుడు మేఘా కృష్ణారెడ్డికి చెప్తే క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించారని పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రికి ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపున అందిస్తామని పేర్కొన్నారు.

English summary
telangana government respect on high court orders minister harish rao said. high court direct to government on omicron cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X