నిలోఫర్‌లో పిల్లల ప్రాణాలతో చెలగాటం.. క్లినికల్ ట్రయల్స్‌పై సర్కార్ సీరియస్
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నిలోఫర్ ఆస్పత్రిలో నవజాత శిశువులు, చిన్నారులపై వైద్య ప్రమాణాలు, నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఔషధ కంపెనీల సహకారంతో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కొరడా ఝుళిపించడానికి సిద్ధమైంది. ఈ దారుణ అంశంపై నిగ్గు తేల్చడానికి సర్కారు దృష్టి పెట్టింది. ఒకవేళ ఈ విషయం వాస్తవమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

భగ్గుమన్న ప్రజా సంఘాలు
పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయనే ఆరోపణల రావడంతో ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. నిలోఫర్ ఆస్పత్రి ముందు ధర్నాలు కూడా నిర్వహించారు. దాంతో ప్రభుత్వంలో ఈ అంశంపై కదలిక వచ్చింది. పిల్లలపై వైద్య పరిశోధనలు చట్టరీత్యా నేరం కావడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొన్నది.

కేసీఆర్ సర్కార్ సీరియస్
నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్ నిజంగా జరుగుతున్నాయా అనే అంశంపై తెలంగాణ సర్కారు తీవ్రంగా పరిగణించింది. దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. చిన్నారులు, నవజాత శిశువులు, చిన్నారులపై ఎన్నిసార్లు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఎవరి ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి? ఈ వ్యవహారంలో ఎంతమంది వైద్యులు పాల్గొన్నారు అనే దిశగా విచారణ చేపట్టనున్నారు.

త్రి సభ్య కమిటీ ఏర్పాటు
త్రి సభ్య కమిటీ అందించే నివేదికను అధ్యయనం చేసి.. ఆ తర్వాత బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఒకవేళ క్లినికల్ ట్రయల్స్ జరిగితే పిల్లల పరిస్థితి ఏలా ఉంది అనే విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. కమిటీ అందించే నివేదికను బట్టి నిలోఫర్‌లో వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.

300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్
తాజా కథనాలు, సమాచారం బట్టి నీలోఫర్‌లో నవజాత శిశువుల నుంచి 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 300 మంది పిల్లలపై ఈ ప్రయోగాలు నిర్వహించినట్టు సమాచారం. 100 మంది జనరల్ వార్డు నుంచి మరో 100 మంది పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) నుంచి, ఇంకో 100 మందిపై నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ) క్లినికల్ ట్రయల్స్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications