హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా విషయంలో మా ఆదేశాలు పాటించరా?: తెలంగాణ సర్కారుకు హైకోర్టు తీవ్ర హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయడం లేదంటే మండిపడింది.

సర్కారుపై హైకోర్టు ఆగ్రహం, హెచ్చరిక

సర్కారుపై హైకోర్టు ఆగ్రహం, హెచ్చరిక

అంతేగాక, తమ ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను ఇందుకు బాధ్యుల్ని చేస్తామని హెచ్చరించింది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని, విచారణ జరగాల్సి ఉందన్న అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

టెస్టులు ఎందుకు చేయడం లేదు..

టెస్టులు ఎందుకు చేయడం లేదు..

ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు కూడా చేయడం లేదని, రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని హైకోర్టు మండిపడింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని నిలదీసింది. జూన్ 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖను హైకోర్టు ఆదేశించింది.

కేసుల గణాంకాలు దాచేస్తే ప్రమాదం..

కేసుల గణాంకాలు దాచేస్తే ప్రమాదం..

ఇది ఇలావుండగా, కరోనా కేసులకు సంబంధించిన గణాంకాలను దాచితే దాని ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా గణాంకాలను ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేయడం లేదన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ మేరకు హైకోర్టు స్పందించింది.

Recommended Video

Nimmagadda Ramesh Kumar Case Coming To Hearing On June 10 In Supreme Court
ప్రజలకు కరోనా తీవ్రత తెలిసేలా..

ప్రజలకు కరోనా తీవ్రత తెలిసేలా..


కరోనా కేసుల గణాంకాలను పత్రికలు, వెబ్ సైట్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం సూచించింది. కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోందన్న అవగాహన ప్రజల్లో కల్పించాలని పేర్కొంది. కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై జూన్ 18లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

English summary
The Telangana High Court on Monday expressed displeasure over the state government for not implementing its orders. "If the orders are not being followed, action will be taken against medical and health officials for violating the court's order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X