జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరో నిందితుడిగా ఉన్న మైనర్ బాలుడిని మేజర్‌గా పరిగణించాలంటూ గతంలో పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఆ బాలుడిని మైనర్‌గానే పరిగణించి దర్యాప్తు కొనసాగించాలంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
సుమారు 10 నెలల క్రితం జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌లో గ్యాంగ్‌రేప్ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లు నిందితులుగా ఉన్నారు. ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగానే పరిగణించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. తీవ్రమైన కేసులో మైనర్లను మేజర్లుగా పరిగణించాలని కోరారు.

ఈ క్రమంలో ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లు పరిగణిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది. పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆరో నిందితుడిగా ఉన్న మైనర్ హైకోర్టుకు వెళ్లాడు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దీంతో ఆ కేసులో ఇప్పుడు నలుగురు మేజర్లు, ఇద్దరు మైనర్లు నిందితులుగా ఉన్నట్లయింది.
కాగా, గత ఏడాది మే 28న ఓ మైనర్ బాలికపై జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌రేప్ జరిగింది. మూడు రోజుల తర్వాత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక వాంగ్మూలం సేకరించారు. అనంతరం నిందితులైన సాదుద్దీన్ తోపాటు ఐదుగురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు.. కేసుకు సంబంధించి నేరాభియోపత్రం దాఖలు చేశారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా అన్ని ఆధారాలు లభించడంతో పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపరిచారు.












Click it and Unblock the Notifications