యూఎస్‌లో బిజీబిజీగా కేటీఆర్- ఆ ఎంఎన్‌సీ హెడ్ క్వార్టర్స్‌లో..!!
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలను కలుసుకుంటోన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఇతర నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వివరిస్తోన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నామని స్పష్టం చేస్తోన్నారు.
ఇందులో భాగంగా ఆయన హ్యూస్టన్‌లోని ఎల్లియంట్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా పూల మాల వేసి ఆహ్వానించారు. ఎల్లియంట్ ఉద్యోగులు ఆయనతో సెల్ఫీ దిగారు. అనంతరం ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్.. తదితరులతో కేటీఆర్ భేటీ అయ్యారు.

బ్యాంకింగ్, ఫైనాన్స్, సెక్యూరిటీస్, ఇన్సూరెన్స్.. వంటి రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ వారికి వివరించారు. ఆయా రంగాలకు తమ ప్రభుత్వం భారీ ఎత్తన ప్రోత్సహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు. దీనికి సంబంధించిన సమగ్ర డాక్యుమెంట్లను అందజేశారు.
హైదరాబాద్‌లో ఇంక్యుబేటర్లు, ఐటీ పార్కుల గురించి ఎల్లియంట్ ఇన్సూరెన్స్ ప్రతినిధులకు కేటీఆర్ తెలియజేశారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలను కల్పించామని, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో పెట్టుబడులను పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఆక్ష్న టెక్నిక్ ఎఫ్ఎంసీ సంస్థను కూడా సందర్శించారు. ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజ కంపెనీ ఇది.
What a lovely welcome at Alliant Headquarters today at Houston!!
— KTR (@KTRBRS) May 20, 2023
Many thanks @Dhavaljadav02 for the grand reception and hospitality 🙏 pic.twitter.com/H8OAhJEfXo
హైదరాబాద్‌ను తమ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడానికి అంగీకరించినట్లు కేటీఆర్ తెలిపారు. ఇంజినీరింగ్‌లో 2,500 ఉద్యోగాలు లభిస్తాయని, తయారీ రంగంలో మరో వెయ్యిమందికి ఈ సంస్థ ఉద్యోగాలను కల్పిస్తుందని అన్నారు. 1,250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా ఉందని చెప్పారు. తొలిదశలో 5,400 కోట్ల రూపాయల విలువ గల ఎగుమతులు చేసేలా ప్రణాళికను రూపొందించుకుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications