తెలంగాణలో మళ్లీ మొదటికి: లక్షకు చేరువగా: 21 వేల కంటే తక్కువగా పేషెంట్లు

హైదరాబాద్: తెలంగాణపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కొద్దిరోజులుగా కాస్తో, కూస్తో తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన పాజిటివ్ కేసులు.. మళ్లీ మొదటికొచ్చాయి. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బిత్తరపోయేలా చేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య ఒకవంక తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. రోజువారీ పెరుగుదల అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య లక్షను అందుకుంటోంది. 95 వేల మార్క్‌ను దాటేసింది.

తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 1763 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 1789 మంది డిశ్చార్జి అయ్యారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 95,700లకు చేరుకుంది. ఇందులో 73,991 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 719కి చేరుకుంది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 20,990గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 14,461 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం బులెటిన్‌ను విడుదల చేసింది.

Telangana: Newly 1763 Covid19 positive cases and 8 deaths reported in last 24 hours

తాజా వివరాల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే తాజాగా నమోదైన కేసులు రెట్టింపు అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 24 గంటల్లో కొత్తగా 484 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య 21 వేల దిగువకు చేరుకోవడం ఇదే తొలిసారి. మొత్తం 20,990 మంది పేషెంట్లు ప్రస్తుతం తెలంగాణలో చికిత్స పొందుతున్నారు.

24 గంటల్లో ఆదిలాబాద్-8, భద్రాద్రి కొత్తగూడెం-35, జగిత్యాల-61, జనగామ-20, జయశంకర్ భూపాలపల్లి-17, జోగుళాంబ గద్వాల-30, కామారెడ్డి-63, కరీంనగర్-53, ఖమ్మం-41, కొమరంభీమ్ ఆసిఫాబాద్-6, మహబూబ్ నగర్-33, మహబూబాబాద్-18, మంచిర్యాల-55, మెదక్-17, మేడ్చల్ మల్కాజ్‌గిరి-169, ములుగు-12, నాగర్ కర్నూలు-15, నల్లగొండ-65, నారాయణ పేట్-6, నిర్మల్-16, నిజామాబాద్-45, పెద్దపల్లి-46, రాజన్న సిరిసిల్ల- 31, రంగారెడ్డి-166, సంగారెడ్డి-31, సిద్ధిపేట్-37, సూర్యాపేట్-20, వికారాబాాద్-8, వనపర్తి-21, వరంగల్ రూరల్-31, వరంగల్ అర్బన్-88, యాదగిరి భువనగిరి-15 కేసులు నమోదు అయ్యాయి.

24 గంటల వ్యవధిలో మొత్తం 24,542 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 7,97,470కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్, సీబీనాట్ ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 21,480 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+