హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంచాయతీ కార్యదర్శుల కొలువుల కసరత్తు.. కొత్త ప్రభుత్వంలో తొలి నియామకాలు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారం చేపట్టబోతోంది. గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు సరిగా చేపట్టలేదనే ఆరోపణలు కొకొల్లలు. ఈనేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ప్రెస్ మీట్ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ ఉద్యోగ నియామకాలు వేగవంతం చేస్తామని ప్రకటించారు. అందుకేనేమో పంచాయతీ కార్యదర్శుల నియామకాలపై దృష్టి సారించారు అధికారులు.

<strong>'సుహాసినిని అలా దెబ్బతీసిన చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ గుర్తించారు, ముందే చెప్పారు' </strong>'సుహాసినిని అలా దెబ్బతీసిన చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ గుర్తించారు, ముందే చెప్పారు'

పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశముండటంతో.. అంతలోపే పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ జోరందుకోనుంది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కొత్త ప్రభుత్వంలో తొలి ఉద్యోగ నియామకాలు ఇవే కావడం విశేషం.

కొత్త జిల్లాలతో రిజర్వేషన్లు.. కసరత్తు ప్రారంభం

కొత్త జిల్లాలతో రిజర్వేషన్లు.. కసరత్తు ప్రారంభం

ఈఏడాది అక్టోబర్ నెలలో నిర్వహించిన రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పంచాయతీ కార్యదర్శుల ఎంపిక జరగనుంది. మొత్తం 9,355 పోస్టులకు గాను నియామక ప్రక్రియ త్వరలో పూర్తికానున్నట్లు సమాచారం. కొత్త జిల్లాలను బేస్ చేసుకుని రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఈమేరకు జిల్లాలవారీగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

పెరిగిన పంచాయతీలు.. కార్యదర్శుల కొరత

పెరిగిన పంచాయతీలు.. కార్యదర్శుల కొరత

రాష్ట్రంలో 8,684 ఉన్న గ్రామపంచాయతీల సంఖ్య కొత్త జిల్లాల ఏర్పాటుతో 12,751 కి చేరింది. దీంతో కార్యదర్శుల పోస్టుల కొరత ఏర్పడింది. అయితే రెండు, మూడు పంచాయతీలకు ఒకే కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించకుండా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే పెద్ద మొత్తంలో 9,355 పోస్టులకు గాను అక్టోబర్ నెలలో రాత పరీక్షను నిర్వహించారు అధికారులు. దాదాపు 4 లక్షల 75వేల మంది ఈ పోస్టుల కోసం పోటీపడ్డారు. మొత్తానికి పేపర్ వాల్యూయేషన్ కూడా పూర్తికావడంతో ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయనుంది పంచాయతీ రాజ్ శాఖ. ఈమేరకు కమిషనర్ నీతూ ప్రసాద్ ఆయా జిల్లాల డీపీవో లతో సమావేశమై నియామక ప్రక్రియపై చర్చించినట్లు సమాచారం.

అటు ఎన్నికలు.. ఇటు ఉద్యోగాలు

అటు ఎన్నికలు.. ఇటు ఉద్యోగాలు


పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జనవరి నెలలో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. అయితే పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ సవ్యంగా జరిగితే.. కొత్త పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేసే లోపు వారు అందుబాటులోకి వస్తారు. ఒక్కో పంచాయతీకి ఒక్కొక్కరుగా కార్యదర్శులు పనిచేసే అవకాశముంటుంది.

English summary
The panchayat elections are expected to be held in January, and the process of recruitment of panchayat secretaries is going to take place. The first job appointments in the new government are the same if they think it is planned. if it is ok, Secretaries will came into work on same time to newly elected ruling classes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X